Central Government Announced Padma Awards 2023: కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా కళలు, సాహిత్యం, విద్య, వైద్యం, క్రీడా, సామాజిక, విజ్ఞాన, ఇంజినీరింగ్, పబ్లిక్ అఫైర్స్, సివిల్ సర్వీస్, వాణిజ్యం, పారిశ్రామిక, మొదలైన రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారిని గుర్తించి.. దేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డులను ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు గణతంత్ర దినోత్సవం సందర్భంగా.. ఈ ఏడాదికి పద్మ అవార్డులను కేంద్రం ప్రకటించింది. మొత్తంగా 106 పద్మ పురస్కాలు ప్రకటించగా.. అందులో ఆరుగురిని పద్మవిభూషణ్, తొమ్మిది మందిని పద్మభూషణ్, 91 మందిని పద్మశ్రీ పురస్కారాలకు కేంద్రం ఎంపిక చేసింది.
Sudheer Babu: మహేష్ బావ కోరిక మాములుగా లేదుగా.. రాజమౌళితోనే కావాలంట
ఈ పద్మ పురస్కారాలకు గాను కేంద్ర ప్రభుత్వం గతేడాది మే 1 నుంచి సెప్టెంబర్ 15 వరకు నామినేషన్లను స్వీకరించింది. ఇప్పుడు రిపబ్లిక్ డే సందర్భంగా పురస్కారాలకు ఎంపికైన వారి జాబితాను విడుదల చేసింది. ఆధ్యాత్మిక విభాగంలో తెలంగాణ నుంచి ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త చినజీయర్ స్వామిని.. అలాగే కమలేశ్ డి పటేల్‌లను పద్మభూషణ్ పురస్కారం వరించింది. ఓఆర్‌ఎస్ (ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్) సృష్టికర్త దిలీప్ మహలనబిస్‌కు వైద్యరంగంలో పద్మవిభూషణ్ పురస్కారాన్ని కేంద్రం ప్రకటించింది. అయితే.. ఆయన గతేడాది అక్టోబర్‌లోనే కన్నుమూశారు. ఇక సామాజిక సేవా విభాగంలో కాకినాడకు చెందిన సంకురాత్రి చంద్రశేఖర్.. గిరిజన, దక్షిణాది భాషలకు అనేక సేవలందించిన బి.రామకృష్ణారెడ్డిలకు పద్మశ్రీ పురస్కారం దక్కింది.
Ambati Rambabu: పవన్ ఎంటర్ టైనర్ మాత్రమే.. జగన్ జనం మనసు గెలిచిన ధీరుడు
తెలంగాణ నుంచి పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన వారిలో మోదడుగు విజయ్ గుప్తా(సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగం), హనుమంతరావు పసుపులేటి(వైద్యం), బి.రామకృష్ణారెడ్డి (సాహిత్యం, విద్య) ఉండగా.. ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి (కళలు), గణేశ్ నాగప్ప కృష్ణరాజనగర, అబ్బారెడ్డి నాగేశ్వరరావు(సైన్స్ అండ్ ఇంజినీరింగ్), సీవీ రాజు, కోట సచ్చిదానంద శాస్త్రి (ఆర్ట్), సంకురాత్రి చంద్రశేఖర్ (సామాజిక సేవ), ప్రకాశ్ చంద్రసూద్ (సాహిత్యం, విద్య విభాగంలో)లను పద్మశ్రీ వరించింది.
Keerthy Suresh: మహానటి పెళ్లి.. సోషల్ మీడియాను షేక్ చేస్తుందే..?