రిజర్వేషన్లపై పలు సందర్భాల్లో నేతలు సంచలన వ్యాఖ్యలు చేసిన సందర్భాలు ఉన్నాయి.. రిజర్వేషన్లతో బడుగు, బలహీన వర్గాలే మెజార్టీ ప్రభుత్వ ఉద్యోగాలను దక్కించుకుంటున్నాయి.. ప్రతిభ ఉన్నవారికి ఉద్యోగాలు దక్కడం లేదని విమర్శలు ఉన్నాయి.. మరోవైపు.. వెనుకబడిన బడుగు, బలహీన వర్గాలకు రిజర్వేషన్లు ఉంటేనే అభివృద్ధి సాధ్యమని వాదిస్తారు.. అయితే, రిజర్వేషన్లపై హిమాచల్‌ప్రదేశ్ మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత శాంత కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. ప్రభుత్వ ఉద్యోగాల్లో కుల ఆధారిత రిజర్వేషన్లను పూర్తి రద్దు చేయాలన్న ఆయన.. కుల ఆధారిత కోటా వ్యవస్థను పూర్తిగా రద్దుచేసి, కుటుంబ ఆదాయం ఆధారంగా రిజర్వేషన్లు కల్పించాల్సిన సమయం వచ్చిందని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.. కుల ఆధారిత రిజర్వేషన్లపై దేశంలో 80 శాతం మంది విసుగెత్తిపోయాన్న శాంత కుమార్.. రిజర్వుడ్ కులాల్లోని పేదలు రిజర్వేషన్లతో పూర్తి లబ్ధి పొందలేకపోతున్నారని అభిప్రాయపడ్డారు.. రిజర్వేషన్లతో ఆయా కేటగిరీలోని సంపన్నులు లాభపడుతున్నారన్న ఆయన.. రిజర్వేషన్ల నుంచి క్రీమీలేయర్‌ను మినహాయించాలన్న డిమాండ్ చాలా ఏళ్లుగా ఉందన్నారు..
రిజర్వేషన్లపై బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు.. విసుగెత్తిపోయారు, రద్దు చేయాలి..!
