Site icon NTV Telugu

Heart Attack: డ్యూటీలో ఉండగా గుండెపోటు.. కార్డియాక్‌ సర్జన్‌ మృతి..

Tn

Tn

Heart Attack: ఇటీవల కాలంలో హార్ట్ ఎటాక్ మరణాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. యువత, ఫిట్‌గా ఉన్నవారు కూడా హఠాత్తుగా గుండెపోటుతో మరణించడం తీవ్రంగా కలవరపెడుతోంది. అయితే, తమిళనాడుకు చెందిన ప్రముఖ కార్డియాక్ సర్జన్ డాక్టర్ గ్రాడ్లిన్ రాయ్ గుండెపోటుతో చనిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కార్డియాక్ సర్జన్‌గా విధులు నిర్వహిస్తున్న గ్రాడ్లిన్ రాయ్, డ్యూటీలో భాగంగా వార్డులలో రౌండ్స్ చేస్తుండగా ఒక్కసారిగా గుండెపోటు వచ్చింది. సహోద్యోగులు ఆయనను కాపాడటానికి అన్ని రకాలుగా ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేని, కార్డియాలజీపై పూర్తి అవగాహన ఉన్న డాక్టర్ హార్ట్ ఎటాక్ తో చనిపోవడం తీవ్ర ఆందోళనకు గురి చేస్తుందని సహచర డాక్టర్‌ సుధీర్‌కుమార్‌ పేర్కొంటున్నారు.

Read Also: Indore: విచిత్ర ప్రేమికురాలు.. ప్రేమికుడి కోసం ఇంట్లో నుంచి పారిపోయి రివర్స్‌లో ఏం చేసిందంటే..!

అయితే, యువతలో ఆకస్మాత్తుగా సంభవిస్తున్న హార్ట్ ఎటాక్ మరణాలకు ఒత్తిడి, అధిక గంటలే కారణమని పలువురు వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. డాక్టర్లు రోజుకు 12- 18 గంటల పాటు పని చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొన్నిసార్లు ఒకే షిఫ్ట్‌లో 24 గంటల పాటు డ్యూటీ చేయాల్సి ఉంటుందన్నారు. అందువల్ల వారిపై ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.. అలాగే, మరికొందరిలో అనారోగ్యకరమైన జీవనశైలి, శారీరక వ్యాయామం లేకపోవడం లాంటి అనేక కారణాలు కూడా గుండెపోటుకు దారితీసే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు తమ అభిప్రాయాన్ని వ్వక్తం చేశారు.

Exit mobile version