Site icon NTV Telugu

Uttarakhand Accident : ఉత్తరాఖండ్ లో ఘోరం.. కాల్వలో పడ్డ కారు.. నలుగురి మృతి

Car

Car

Uttarakhand Accident : ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఘోరం జరిగింది. బాగేశ్వర్‌లోని రమాడి సమీపంలో కారు కాలువలో నలుగురు మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వివరాల్లోకి వెళితే.. దర్వాన్ సింగ్ అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలిసి వారం రోజుల క్రితం గ్రామానికి వచ్చాడు. పిథోరఘర్ జిల్లాలోని హోక్రా వద్ద ఉన్న హోక్రా ఆలయంలో కుటుంబం సామూహిక పూజలు చేశారు. రెండు రోజుల క్రితమే పూజలు పూర్తయ్యాయి. దర్వాన్ సింగ్ గురువారం సాయంత్రం షామా (కాప్‌కోట్)కి తిరిగి పయనమయ్యారు. దర్వాన్ సింగ్‌తో పాటు హ్యుందుంగరా గ్రామానికి చెందిన ఇద్దరు, గ్రామ భనార్ తిక్తాకు చెందిన ఒక మహిళా, కనౌలీ గ్రామానికి చెందిన మహిళ, ఒక బాలిక ప్రయాణిస్తున్నారు.

Read Also: Cyclone Mandous : మాండస్ ముప్పు పొంచి ఉంది తస్మాత్ జాగ్రత్త

ఈ ప్రమాదంలో దర్వాన్ సింగ్ తో పాటు ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం కారణంగా ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ప్రమాదంలో గాయపడిన పుష్పాదేవి గ్రామంలోనే టైలరింగ్ పని చేస్తుంది. గాయపడిన బాలిక పుష్పాదేవి సోదరుడు గంగా సింగ్ కుమార్తె అని సమాచారం. చనిపోయిన లాలీ దేవి భర్త ఖుషాల్ సింగ్ కాంట్రాక్టు చేస్తున్నాడు. మృతురాలు గోపులి దేవి భర్త గోపాల్ సింగ్ గతంలో డ్రైవర్. ఈ ప్రమాదంతో హ్యుందుంగర గ్రామంతో పాటు భనార్ తిక్తా గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. మరోవైపు కనౌలి-రామారి-షామా రహదారి పరిస్థితి బాగా లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలా చోట్ల రోడ్డు వేయలేదని… రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని ఈ ప్రాంత ప్రజలు చాలా కాలంగా కోరుతున్నా రోడ్డు బాగు చేయాల్సిన అధికారులు పట్టించుకోలేదని వాపోయారు,

Exit mobile version