Budaun Murder New: ఉత్తర్‌ప్రదేశ్‌లోని బుదౌన్ డబుల్ మర్డర్ కేసు స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ముక్కుపచ్చలారని ఇద్దరు చిన్నారులను ఓ బార్బర్ అత్యంత దారుణంగా చంపేశాడు. అనంతరం కొన్ని గంటల వ్యవధిలోనే పోలీసుల కాల్పుల్లో నిందితుడు కూడా హతమయ్యాడు. ఇద్దరు చిన్నారులు ఆయుష్, అహాన్‌లను హత్య చేసిన కేసులో నిందితుల్లో ఒకరైన జావేద్‌ను కోర్టు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. నిందితుడు జావేద్‌ను న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. ఈమేరకు శుక్రవారం నిందితుడు జావేద్‌ను కోర్టులో హాజరుపరిచారు. నిందితుడిని బరేలీ నుంచి పోలీసులు అరెస్టు చేశారు.
Read Also:Drugs in Hyderabad: హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్ పట్టివేత..!
గర్భిణిగా ఉన్న తన భార్యకు డెలివరీ ఖర్చుల నిమిత్తం రూ.5 వేలు ఇవ్వాలంటూ నిందితుడు సాజిద్.. పరిచయస్తుడైన వినోద్ ఇంటికి మంగళవారం సాయంత్రం వెళ్లాడు. ఆ డబ్బులు అప్పుగా ఇచ్చేందుకు వినోద్ భార్య సంగీత అంగీకరించింది. అయితే ఆమె లోపలికి వెళ్లినప్పుడు.. ఇంట్లో ఆడుకుంటున్న ఆమె కుమారుడు ఆయుష్ (12)ను సాజిద్ మేడపైకి తీసుకువెళ్లి కత్తితో పొడిచి చంపాడు. ఆయుష్ సోదరులైన అహాన్(7), పియూష్(6) అదే సమయంలో అక్కడికి రావడంతో వారిపైనా దాడికి తెగబడ్డాడు. వీరిలో అహాన్ కూడా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. పియూష్ మాత్రం స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ పరిణామంతో స్థానికులు, చిన్నారుల కుటుంబ సభ్యులు, బంధువులు దిగ్భ్రాంతికి గురయ్యారు. పిల్లలను చంపిన తర్వాత నిందితుడు అక్కడి నుంచి పరారై సమీపంలోని అడవుల్లోకి పారిపోయాడు. అక్కడ పోలీసులకు తారసపడి కాల్పులకు పాల్పడ్డాడు. దీంతో ఎదురు కాల్పుల్లో నిందితుడు హతమయ్యాడని పోలీసు అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే కోపోద్రిక్తులైన స్థానికులు.. సాజిద్ దుకాణాన్ని తగలబెట్టారు.
Read Also:Barrelakka: పెళ్లిపీటలెక్కబోతున్న బర్రెలక్క..!
స్థానికంగా ఈ ఘటన తీవ్ర కలకలం రేపడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరో వైపు కేసు నమోదు చేసుకున్న పోలీసులు చిన్నారుల మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. అలాగే హత్యకు గల కారణాలను కూడా అన్వేషిస్తున్నారు. తాజాగా నిందితుడు సాజిద్ సోదరుడు గౌరవ్ కుమార్ బిష్ణోయ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కస్టడీలో అతన్ని విచారిస్తున్నారు. హత్యకు గల కారణాలపై లోతుగా విచారిస్తున్నారు.
