ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి ట్రయల్ కోర్టు జ్యుడీషియల్ కస్టడీ పొడిగించింది. జ్యుడీషియల్ రిమాండ్‌ను జూలై 18 వరకు న్యాయస్థానం పొడిగించింది. ఇదిలా ఉంటే పలుమార్లు కవిత బెయిల్ పిటిషన్లు వేసింది. కానీ ధర్మాసనం తిరస్కరించింది. ఇటీవల ఢిల్లీ హైకోర్టులో వేసిన రెండు పిటిషన్లను కూడా కొట్టివేసింది. దీంతో కవితకు తీవ్ర నిరాశ ఎదురైంది.
ఇది కూడా చదవండి: NEET PG 2024 Exam Date: నీట్ పీజీ పరీక్ష తేదీ ఖరారు..ఎప్పుడంటే..?
లిక్కర్ పాలసీ కేసులో మార్చి 15న కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం ఈడీ కస్టడీకి అనుమతి ఇచ్చింది. అనంతరం జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో తీహార్ జైలుకు తరలించారు. గత నాలుగు నెలలుగా జైల్లోనే కవిత ఉంటున్నారు. లిక్కర్ స్కామ్‌లో ఆప్‌కు కవిత రూ.100 కోట్లు ముడుపులు అందించినట్లుగా ఈడీ ఆరోపించింది.
ఇది కూడా చదవండి: Vizag: కిడ్నీ రాకెట్ కేసులో వెలుగులోకి నిజాలు.. ఎన్ఆర్ఐ ఆసుపత్రికి బిగుస్తున్న ఉచ్చు