దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఎగ్జిట్ పోల్స్ కూడా వచ్చేశాయి. 27 ఏళ్ల తర్వాత హస్తినలో బీజేపీ అధికారంలోకి రాబోతుందని సర్వేలన్నీ తేల్చేశాయి. ఇదిలా ఉంటే తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ.. బీజేపీపై సంచలన ఆరోపణలు చేసింది. ఆప్ అభ్యర్థులకు బీజేపీ నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయని.. ఏడుగురు ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులకు ఒక్కొక్కరికీ రూ.15 కోట్లు ఆఫర్ చేశారని ఆ పార్టీ సీనియర్ నేత సంజయ్ సింగ్ సంచలన ఆరోపణలు చేశారు. ఆప్‌ను విచ్ఛన్నం చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తారు. ఏడుగురి పేర్లు మాత్రం సంజయ్ సింగ్ వెల్లడించలేదు గానీ… ఫోన్ కాల్స్ వచ్చినట్లుగా సంజయ్ సింగ్ వెల్లడించారు.
ఇది కూడా చదవండి: PM Modi: అంబేద్కర్‌ను కాంగ్రెస్ ఎప్పుడూ గౌరవించలేదు.. ఇప్పుడు ఓట్ల కోసం జై భీమ్ అంటోంది..!
ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. బుధవారం (ఫిబ్రవరి 5) పోలింగ్ జరిగింది. మొత్తం 60 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. అయితే ఈసారి మాత్రం బీజేపీ అధికారంలోకి రాబోతుందని సర్వేలు తేల్చాయి. అయితే ఈ సర్వేలను ఆప్ తోసిపుచ్చింది. గతంలో కూడా ఎప్పుడూ ఆప్ అధికారంలోకి వస్తుందని సర్వేలు చెప్పలేదని.. కానీ అధికారంలోకి వచ్చామన్నారు. ఇప్పుడు కూడా సర్వేలు అవే చెబుతున్నాయని.. కానీ అధికారంలోకి వచ్చేది మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీనేనని ఆ పార్టీ నేతలు చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే ఈ శనివారం ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. అయితే ఈసారి కూడా కాంగ్రెస్‌కు జీరో సీట్లే వస్తాయని ఎగ్జిట్ పోల్స్ తేల్చేశాయి.
ఇది కూడా చదవండి: CM Revavnth Reddy : స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం కీలక నిర్ణయం