Site icon NTV Telugu

Raja Singh on EC Notice: నేను తప్పు చెప్పలే.. ఈసీకి వివరణ ఇస్తా..

ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆ రాష్ట్ర ఓటర్లను ఉద్దేశిస్తూ ఓ వీడియో విడుదల చేసిన బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్‌.. యూపీ ఓటర్లకు వార్నింగ్‌ ఇవ్వడంపై పెద్ద రచ్చ జరుగుతోంది.. ఈ వ్యవహారంపై స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం.. చర్యలు ఎందుకు తీసుకోకూడదో తెలియిజేయాలంటూ నోటీసులు జారీ చేసింది.. 24 గంటల్లో సమాధానం చెప్పాలని డెడ్‌లైన్‌ పెట్టిన విషయం తెలిసిందే.. ఇక, ఈసీ నోటీసుపై స్పందించిన బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్‌.. వివరణ ఇస్తానని తెలిపారు.. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి మా ఆఫీసుకి నోటీసు వచ్చినట్టు ఇప్పుడే తెలిసిందంటూ ఓ వీడియో విడుదల చేసిన రాజా సింగ్.. తాను చేసిన వ్యాఖ్యల విషయంలో మాత్రం వెనక్కి తగ్గినట్టుగా కనిపించలేదు.. గతంలో యూపీలో అధికారంలో ఉన్న అఖిలేష్‌ యాదవ్‌ సర్కార్‌ సమయంలో.. ఎన్నో అరాచకాలు జరిగాయి.. అవి వివరించే ప్రయత్నమే చేశానన్న ఆయన.. ఆవు మాంసం తినేవారు నాపై కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.. ఉత్తరప్రదేశ్‌లో మరోసారి యోగి ఆదిత్యానాథ్ అధికారంలోకి రావాలంటూ ఉజ్జయినిలో హోమం నిర్వహించేందుకు వెళ్తున్నానని.. నా లాయర్‌ ద్వారా ఈసీకి వివరణ ఇస్తానని తెలిపారు.

Read Also: Bhuma Akhila Priya: జగత్ విఖ్యాత్ రెడ్డికి ప్రాణహాని..!

కాగా, హిందువులందరూ ఏకం కావాలి.. హిందువులంతా యోగి ఆదిత్యనాథ్‌కు ఓటు వేయాల్సిందేనని పిలుపునిచ్చిన రాజా సింగ్.. ఎన్నికల్లో యోగి ఆదిత్యానాథ్‌కు ఓటు వేయనివారంతా ద్రోహులు అని.. వారికి ఉత్తర ప్రదేశ్‌లో స్థానం లేదని పేర్కొన్నారు.. ఇక, యోగికి ఓటు వేయని వారిని తరిమి తరిమి కొడతామని వార్నింగ్‌ ఇచ్చిన ఆయన.. యోగీకి ఓట్లు వేయనివారిని గుర్తిస్తామని.. ఇప్పటికే వందల సంఖ్యలో బుల్‌డోజర్లు, జేసీబీలకు ఆర్డర్ ఇచ్చారని, వాటిని తెప్పిస్తున్నారని.. బుల్‌డోజర్లు, జేసీబీలను ఎందుకు తెప్పిస్తున్నారో.. తెలుసా? యోగికి ఓటు వేయని వారిని గుర్తించి.. వారి ఇంటికి వందల సంఖ్యలో బుల్‌డోజర్లు, జేసీబీలు పంపిస్తామని హెచ్చరించారు.. అయితే, యూపీలోని ఓటర్లను తమ పార్టీకి ఓటు వేయాలని, లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని బెదిరింపులకు పాల్పడినందుకు తెలంగాణకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే టి. రాజా సింగ్‌కు ఈసీ నోటీసులు పంపింది.. ఐపీసీ, ఆర్‌పీ చట్టం మరియు ఎన్నికల మోడల్ కోడ్ ఉల్లంఘించినందుకు అతనిపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని ఆదేశించింది… దీని కోసం ఎమ్మెల్యే రాజా సింగ్‌కు 24 గంటల సమయం ఇచ్చింది ఎన్నికల కమిషన్‌..

Exit mobile version