Bangalore Man Complains About His Wife On Twitter: మహిళలే కాదు.. పురుషులు కూడా గృహహింసకు గురవుతున్నారు. విమెన్ కార్డుని అడ్డం పెట్టుకొని.. కొందరు మహిళలు తమ భర్తల్ని టార్చర్ పెడుతున్నారు. ఇష్టానుసారంగా కొడుతూ తమ పైశాచికాన్ని ప్రదర్శిస్తున్నారు. ‘నువ్వు మగాడివి, ఈ సమాజంలో నీ మాట ఎవ్వరూ వినరు’ అంటూ చెప్పి మరీ వేధింపులకు గురి చేస్తున్నారు. దీంతో తమ గోడు ఎవ్వరితోనూ చెప్పుకోలేక, చాలామంది మగాళ్లు తన భార్యలు పెట్టే వేధింపుల్ని భరిస్తూనే ఉన్నారు. బెంగళూరుకి చెందిన ఓ వ్యక్తి కూడా, అందరిలాగే తన భార్య హింసను సహిస్తూ వచ్చాడు. కానీ, భార్య వేధింపులు మరీ ఎక్కువ కావడంతో, సోషల్ మీడియాలో తనని కాపాడాల్సిందిగా వేడుకున్నాడు.
ఆ వ్యక్తి పేరు యదునందన్ ఆచార్య. బెంగళూరులో ఓ ఇంజనీర్‌గా పని చేస్తోన్న ఇతను.. లింగ వివక్షపై ఎప్పట్నుంచో పోరాటం కొనసాగిస్తున్నాడు. తాజాగా ట్విటర్ మాధ్యమంగా.. రక్తమోడుతున్న అరచెయ్యి ఫోటోను షేర్ చేశాడు. ‘‘నాకు ఎవరైనా సహాయం చేస్తారా? లేదు.. ఎందుకంటే నేను మగాడ్ని కాబట్టి. నా భార్య నాపై కత్తితో దాడి చేసింది. నారీ శక్తి అంటే ఇదేనా? ఈ ఘటన ఆధారంగా నేను నా భార్యపై గృహ హింస కేసు పెట్టగలనా? లేదు.. ఎందుకంటే మగాడ్ని కదా!’’ అంటూ ట్విటర్‌లో రాసుకొచ్చాడు. ఈ ట్వీట్‌కి మెన్‌టూ అనే హ్యాష్‌ట్యాష్ పెట్టి.. ప్రధానమంత్రి కార్యాలయం, కేంద్రమంత్రి కిరణ్ రిజిజు, బెంగళూరు పోలీస్ కమిషనర్‌ని ట్యాగ్ చేశాడు. తనపై భార్య గృహ హింసకు పాల్పడుతోందని మొరపెట్టుకున్న అతగాడు.. తన ఫిర్యాదుని స్వీకరించాలని కోరాడు.
ఈ పోస్ట్ పెట్టినందుకు గాను నెట్టింట్లో ఆచార్యకు విస్తృత స్థాయిలో మద్దతు లభిస్తోంది. తామూ బాధితులమేనంటూ ఆ ట్వీట్ కింద కామెంట్లు పెడుతున్నారు. మహిళలకు సమానంగా పురుషులకు హక్కులు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. రానురాను మహిళల అరాచకాలు పెచ్చుమీరిపోతున్నాయని, ప్రభుత్వం ఏదో ఒక యాక్షన్ తీసుకోవాల్సిందేనని కోరుతున్నారు. ఈ క్రమంలోనే రామదాస్ అయ్యర్ అనే ఓ వ్యక్తి.. చేతికి కట్టుకట్టిన ఫోటోను షేర్ చేస్తూ, దసరాకు తన భార్య ఇచ్చిన బహుమానం ఇదని పేర్కొన్నాడు.
https://twitter.com/yaadac/status/1586333846244507648?s=20&t=AvwyrPaVrxM8y-Y3XN8D-Q
