ఆయోద్యలో రామాలయ నిర్మాణం పనులు వేగంగా సాగుతున్నాయి. గతేడాది నుంచి కరోనా మహమ్మారి కారణంగా మొదట్లో పనులు కొంత ఆలస్యమైనా, ఆ తరువాత పనులు వేగవంతం చేశారు. అక్టోబర్ నాటికి అయోద్య రామాలయం పునాదుల పనులు పూర్తవుతాయని, వచ్చే ఏడాది యూపీ అసెంబ్లీ ఎన్నికల నాటికి రామాలయం మొదటి ఫ్లోర్ పనులు పూర్తి అవుతాయని అయోద్య రామాలయం ట్రస్ట్ సంస్థ ప్రకటించింది. 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికల లోపే అయోద్య రామాలయ నిర్మాణం పూర్తవుతుందని ట్రస్ట్ ప్రటించింది. 2019లో ఆయోద్య రామాలయానికి సంబందించి కోర్టు తీర్పు వెలువడింది. ఈ తీర్పు అనంతరం అయోద్య ట్రస్ట్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆలయ నిర్మాణం కోసం దేశవ్యాప్తంగా ప్రజల నుంచి నిధులను సేకరించారు. ప్రజలు ఇచ్చిన నిధులతోనే ఆలయాన్ని నిర్మిస్తున్నారు.
అయోద్యలో రామాలయ నిర్మాణం… అక్టోబర్ నాటికి…
