Site icon NTV Telugu

Australia: ఉద్యోగాల పేరుతో కొరియన్ మహిళలపై అత్యాచారం.. భారత సంతతి వ్యక్తికి 40 ఏళ్లు శిక్ష..

Australia

Australia

Australia: నకిలీ ఉద్యోగాల పేరుతో మహిళల్ని మోసం చేసి, వారి నిస్సహాయతను ఆసరా చేసుకుని దారుణంగా అత్యాచారాలకు పాల్పడిన భారత సంతతి వ్యక్తికి ఆస్ట్రేలియా కోర్టు 40 ఏళ్ల జైలు శిక్ష విధించింది, నిందితుడికి 30 ఏళ్ల వరకు ఎలాంటి పెరోల్ లేకుండా శిక్షను ప్రకటించింది. 43 ఏళ్ల బాలేష్ ధంఖర్ అనే వ్యక్తి ఆస్ట్రేలియాలో ఐదుగురు కొరియన్ మహిళలపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

శిక్ష విధించేటప్పుడు బాలేష్‌లో ఎలాంటి పశ్చాత్తాపం లేదని న్యాయమూర్తి పేర్కొన్నారు. అతను ముందుగానే ప్లాన్ చేసుకుని, నేరాన్ని అమలు చేశాడని, అత్యాచారాలకు పాల్పడినట్లు కోర్టు పేర్కొంది. ఆస్ట్రేలియన్ మీడియ కథనాల ప్రకారం.. మాజీ ఐటీ కన్సల్టెంట్ అయిన బాలేష్ తన ఇంట్లో మహిళలకు మత్తుమందు ఇచ్చి, ఆపై వారిపై అత్యాచారం చేసినట్లు ఆరోపించబడ్డాడు. అతను తన లైంగిక చర్యల్ని రికార్డ్ చేశాడు. ఆ తర్వాత వీటి ద్వారా బ్లాక్‌మెయిల్ చేసేందుకు ప్రయత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

Read Also: PM Modi: ఉపరాష్ట్రపతిని పరామర్శించిన పీఎం మోడీ.. త్వరగా కోలుకోవాలని ప్రార్థన..

జిల్లా కోర్టు న్యాయమూర్తి మైఖేల్ కింగ్ మాట్లాడుతూ.. నేరస్తుడి ప్రవర్తన ముందుగా ప్లాన్ చేసి అమలు చేసినట్లు తెలుస్తోందని, మోసపూరితంగా అత్యంత దోపిడీకి పాల్పడ్డాడని పేర్కొన్నారు. ప్రతీ బాధితురాలని పూర్తిగా నిర్దయగా నిర్లక్ష్యంగా చేయడం ద్వారా తన లైంగిక సంతృప్తి తీర్చుకున్నాడని కోర్టు చెప్పింది. సంబంధం లేని ఐదుగురు యువతులు, దుర్బల మహిళపై ప్రణాళికాబద్ధంగా దోపిడీకి పాల్పడినట్లు కోర్టు ఆరోపించింది. మహిళలంతా 21-27 ఏళ్ల మధ్య వయసు కలిగిన వారు. వేధింపుల సమయంలో వారంతా అపస్మారక స్థితిలో లేదా బలహీనంగా ఉన్నారు.

ధంఖర్ తన చర్యల కోసం ఎక్స్ఎల్ స్ప్రెడ్ షీట్‌ని కలిగి ఉన్నాడు. ఇందులో తన నకిలీ ఉద్యోగ ప్రకటన కోసం సంప్రదించిన ప్రతీ దరఖాస్తుదారుడికి రేటింగ్ ఇచ్చాడు. రేటింగ్స్ లుక్స్, తెలివితేటలు, ప్రతీ బాధితురాలితో తన చర్యలకు సంబంధించిన సూచనలు ఉన్నాయి. ఈ కేసులో 2018లో ఇతడిని అరెస్ట్ చేశారు. భారత్-ఆస్ట్రేలియన్ సొసైటీలో ఎంతో గౌరవం కలిగిన వ్యక్తి ఈ నేరాలకు పాల్పడ్డాడు. 2018లో ఐదో బాధిత మహి అతడిపై ఫిర్యాదు చేయడంతో అతడి లైంగిక వేధింపులు వెలుగులోకి వచ్చాయి. 2023లో కోర్టు అతడిపై 13 లైంగిక వేధింపులు, నేరాలతో సహా 39 నేరాలకు పాల్పడినట్లు నిర్ధారించింది. అతడు మహిళలకు మత్తుమందు ఇవ్వడం, సెక్స్ ఏకాభిప్రాయంతో జరిగాయని శాదించాడు.

Exit mobile version