Punjab Ex MP: నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌పై పంజాబ్ మాజీ ఎంపీ సిమ్రంజిత్ సింగ్ మాన్ అవమానకర వ్యాఖ్యలు చేయడంతో గురువారం వివాదం చెలరేగింది. రైతుల నిరసనల్లో అత్యాచారాలు జరిగాయని కంగనా ఆరోపించడంతో వివాదం మొదలైంది. ఈ వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ శిరోమణి అకాలీదళ్(అమృత్ సర్) నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి. ‘‘రేప్ ఎలా జరుగుతుందో మీరు ఆమె(కంగనా రనౌత్)ని అడగండి. తద్వారా రేప్ ఎలా జరుగుతుందో ప్రజలకు వివరించవచ్చు. ఆమెకు రేప్‌లో చాలా అనుభవం ఉంది’’ అని సంగ్రూర్ మాజీ ఎంపీ అన్నారు.
Read Also: TTD: తిరుమల శ్రీవారి భక్తులకు షాక్.. ఇకపై అదనపు లడ్డూలు కావాలంటే?
రద్దు చేయబడిని వ్యవసాయ చట్టాలు, రైతులు ఉద్యమం గురించి కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశాడు. ఇటీవల ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. భారతదేశ నాయకత్వం తగినంత బలంగా లేకుంటే రైతుల నిరసనలు దేశంలో బంగ్లాదేశ్ వంటి సంక్షోభానికి దారితీసేవని చెప్పారు. 2019-2020లో దాదాపు ఏడాది పాటు సాగిన రైతుల నిరసనల్లో శరీరాలు వేలాడుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి అని ఆమె అన్నారు. ఈ కుట్రలో చైనా, అమెరికా ప్రమేయం ఉందని ఆమె చెప్పారు.
కంగనా రనౌత్ చేసిన ఈ వ్యాఖ్యల దుమారాన్ని రేపుతుండగా, బీజేపీ మాత్రం ఆమె వ్యాఖ్యలు దూరంగా ఉంది. పార్టీ విధానపరమైన విషయాలపై వ్యాఖ్యానించేందుకు కంగనాకు అనుమతి లేదా అధికారం లేదని బీజేపీ పేర్కొంది. పార్టీ నాయకత్వం తనను మందలించినట్లుగా ఆమె చెప్పారు. నేను పార్టీకి చివరి గొంతుక అని అనుకునేంత మూర్ఖురాలిని కాదని చెప్పారు.
