Site icon NTV Telugu

Kejriwal: ఢిల్లీ అగ్నిప్రమాద బాధితులకు రూ.10లక్షల పరిహారం

Wal

Wal

దేశ రాజధాని ఢిల్లీలోని (Delhi Fire Accident) అలీపూర్‌ అగ్నిప్రమాదంలో చనిపోయిన మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ (Kejriwal) ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. మరణించిన వారి బంధువులకు ఢిల్లీ సీఎం రూ. 10 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ఇస్తున్నట్లు తెలిపారు.

అలీపూర్ అగ్ని ప్రమాదంలో మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు.. తీవ్ర గాయాలపాలైన వారికి రూ.2 లక్షలు.. స్వల్పంగా గాయపడిన వారికి రూ.20 వేలు చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇస్తామని కేజ్రీవాల్ తెలిపారు.

గురువారం అలీపూర్ రంగుల ఫ్యాక్టరీలో జరిగిన అగ్నిప్రమాదంలో 11 మంది మృతి చెందారు. మరో నలుగురికి గాయాలయ్యాయి. దాదాపు 22 ఫైరింజన్లు మంటలు ఆర్పాయి.

తాజాగా వారి కుటుంబాలకు ఢిల్లీ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, తీవ్ర గాయాలపాలైన వారికి రూ.2 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.20 వేలు చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇస్తామని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. అలాగే అగ్నిప్రమాదంలో కాలిపోయిన సమీపంలోని దుకాణాలు మరియు ఇళ్లకు కూడా నష్టాన్ని అంచనా వేసిన తర్వాత పరిహారం ఇస్తామని హామీ ఇచ్చారు.

Exit mobile version