Site icon NTV Telugu

Al-Falah University: ఢిల్లీ ఉగ్రదాడి.. అల్ ఫలాహ్ యూనివర్సిటీ సభ్యత్వం రద్దు..

Al Falah University

Al Falah University

Al-Falah University: ఢిల్లీ ఎర్రకోట వద్ద కారు బ్లాస్ట్ కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటికే, కారు నడిపిన బాంబర్‌ను డాక్టర్ డాక్టర్ ఉమర్ నబీగా గుర్తించారు. కారులోని అతడి శరీర భాగాల డీఎన్ఏ అతడి తల్లిదండ్రుల డీఎన్ఏతో 100 శాతం మ్యాచ్ అయ్యాయి. ఇదిలా ఉంటే, ఈ కేసులో ఇప్పటికే డాక్టర్ షాహీన్ సయీద్, డాక్టర్ ఆదిల్ రాథర్, డాక్టర్ ముజమ్మిల్ షకీల్‌లను పోలీసులు అరెస్ట్ చేసి, విచారణ జరుపుతున్నారు. అయితే, వీరందరి పరిచయానికి హర్యానా ఫరీదాబాద్ లోని అల్ ఫలాహ్ యూనివర్సిటీ కేంద్రంగా ఉంది. దీంతో ఇప్పుడు భద్రతా ఏజెన్సీల చూపు ఈ యూనివర్సిటీపై పడింది.

Read Also: Maharashtra: పూణేలో ఘోర రోడ్డు ప్రమాదం.. వాహనాలను ఢీకొన్న ట్రక్కు.. 8 మంది సజీవ దహనం

ఇప్పటికే ఈ కేసును ఎన్ఐఏ దర్యాప్తు చేస్తుండగా, ఇప్పుడు అల్ ఫలాహ్ యూనివర్సిటీ ఆర్థిక వ్యవహారాలను ఈడీ దర్యాప్తు చేయబోతోంది. ఇదిలా ఉంటే, అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ (AIU) ఫరీదాబాద్‌లోని అల్-ఫలాహ్ విశ్వవిద్యాలయం సభ్యత్వాన్ని సస్పెండ్ చేసింది. అన్ని యూనివర్సిటీలు మంచి స్థితిని కొనసాగించినంత వరకు మాత్రమే సభ్యులుగా ఉంటాయని AIU పేర్కొంది. మీడియా నివేదికల ప్రకారం, అల్ ఫలాహ్ యూనివర్సిటీ మంచి స్థితిలో ఉన్నట్లు కనిపించడం లేదని అధికారిక లేఖలో పేర్కొంది. దీంతో AIU విశ్వవిద్యాలయం సభ్యత్వాన్ని తక్షణమే నిలిపివేసింది. దాని ఆపరేషన్లలో పేరు/లోగో ఉపయోగించడం నిలిపేయాలని అసోసియేషన్ సంస్థ ఆదేశించింది. దాని అధికారిక వెబ్‌సైట్ నుండి AIU లోగోను వెంటనే తొలగించాలని అల్-ఫలా విశ్వవిద్యాలయాన్ని ఆదేశించింది.

Exit mobile version