Site icon NTV Telugu

UP: అఖిలేష్‌ యాదవ్‌తో పాటు ఆయన కూడా రాజీనామా..!

సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్‌… అసెంబ్లీ ఎన్నికల్లో కర్హాల్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎమ్మెల్యేగా తొలిసారి పోటీ చేసి… విజయం సాధించారు. ఇప్పటికే ఆయన ఆజంగఢ్‌ లోక్‌సభ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో అఖిలేష్‌ యాదవ్‌… ఏదో ఒక పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అఖిలేష్‌తో పాటు సమాజ్‌వాదీ పార్టీకి చెందిన మరో సీనియర్‌ నేత ఆజం ఖాన్‌ కూడా తాజా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. రాంపూర్‌ లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తోన్న ఆజంఖాన్‌.. శాసనసభ ఎన్నికల్లో రాంపూర్‌ స్థానం నుంచే పోటీ చేసి విజయం సాధించారు. దీంతో ఆయన కూడా… ఒక పదవిని వదులు కోవాల్సిన పరిస్థితి వచ్చింది.

Read Also: Owaisi: ఆజాద్‌ను రాష్ట్రపతి అభ్యర్థిగా పెట్టినా.. బీజేపీ శతృవే..

ఎస్పీ చీఫ్ అఖిలేష్‌.. అజంఖాన్‌లు.. పార్లమెంట్‌ సభ్యులుగానే కొనసాగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం లోక్‌సభలో ఎస్పీ నుంచి కేవలం ఐదుగురు ఎంపీలు మాత్రమే ఉన్నారు. రాజకీయ పరిస్థితులు, 2024 సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని.. దిగువసభలో పార్టీని బలహీనపర్చొద్దని అఖిలేష్‌ భావిస్తున్నట్లు సమాచారం. కొద్ది రోజుల్లో వీరు తమ శాసనసభ సభ్యత్వాలకు రాజీనామా చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీలో సమాజ్‌వాదీ పార్టీ బాధ్యతలను శివపాల్‌ యాదవ్‌కు అప్పగించే అవకాశాలున్నట్లు ఎస్పీ వర్గాలు చెబుతున్నాయి. ప్రతిపక్ష నేతగా శివపాల్‌ను ఎన్నుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం.

Exit mobile version