Site icon NTV Telugu

Air India Flight: మరో ఎయిరిండియా విమానానికి తృటిలో తప్పిన ప్రమాదం..

Airindia

Airindia

Air India Flight: మహారాష్ట్ర రాజధాని ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఇవాళ (జూలై 21న) ఉదయం ఎయిరిండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. భారీ వర్షాల కారణంగా ఎయిరిండియా ఫ్లైట్ (AI 2744) రన్‌వేపై ల్యాండ్ అవుతున్న సమయంలో ఒక్కసారిగా అదుపుతప్పి పక్కకు జరిగిపోయింది. ఈ విమానం కొచ్చిన్ నుంచి ముంబై వస్తుండగా ఈ ఘటన జరిగింది.

Read Also: Chairman’s Desk: యువత రాజకీయాల్లోకి ఎందుకు రావట్లేదు?.. కారణాలు ఇవేనా?

అయితే, రన్‌వే నెంబర్ 27పై ల్యాండింగ్ అవుతున్న సమయంలో వర్షం కారణంగా రన్‌వే తడిగా ఉండటంతో విమానం సడెన్‌గా పక్కకు జరిగింది. అప్రమత్తమైన పైలట్.. విమానాన్ని నియంత్రించాడు. దీంతో ప్రయాణికులందరూ ఊపిరి ఒక్కసారిగా పీల్చుకున్నారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లైంది. కాగా, ఈ ప్రమాదానికి గల కారణాలు తెలుసుకునేందుకు అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. విమానానికి ఏమైనా డ్యామేజ్ అయిందా?.. ఇంజిన్ లేదా టెక్నికల్ లోపాలు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో తనిఖీ చేస్తున్నారు.

Read Also: Vidadala Rajini: జనం గుండెల్లో జగన్ ఉన్నారు.. మాజీ మంత్రి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

ఇక, రన్‌వే నం.27ను తాత్కాలికంగా మూసివేసినట్లు ఎయిర్‌పోర్టు అధికారులు వెల్లడించారు. భారీ వర్షాల నేపథ్యంలో రన్‌వేపై తగిన రక్షణ చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు గతంలో కూడా జరిగాయి. 2020 ఆగస్టులో కోజికోడ్‌లో ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం రన్‌వేపై అదుపుతప్పి కూలిన ఘటనలో 21 మంది చనిపోయారు.

Exit mobile version