ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల ఆరాచకాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఎలాగైనా ప్రాణాలతో బయటపడితే చాలు అనుకొని చాలామంది ప్రజలు తాలిబన్ల కళ్లుగప్పి కాబూల్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటున్నారు. ప్రస్తుతం ఆ దేశం నుంచి ప్రజల తరలింపు ప్రక్రియ కొనసాగుతున్నది. భారతీయులను వేగంగా అక్కడి నుంచి ఇండియాకు తరలిస్తున్నారు. వీరితో పాటుగా ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన వారిని కూడా ఇండియాలకు తరలిస్తున్నారు. ఇందుకోసం భారత్ దేవీ శక్తి పేరుతో ఆపరేషన్‌ను చేపట్టింది. ఇక ఇదిలా ఉంటే, ఆఫ్ఘనిస్తాన్‌లో తొలి ముస్లిమేతర సిక్కు మహిళా ఎంపీ అనార్కలీ హోనార్యర్ ఇటీవలే శరణార్దులతో కలిసి ఢిల్లీ వచ్చారు. తన మాతృదేశం ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చేసమయంలో పిడికెడు మట్టి కూడా తీసుకురాలేకపోయానని, అక్కడి పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, బతికుంటే చాలు అని అనుకొని అక్కడి నుంచి తప్పించుకొని వస్తున్నామని అన్నారు. తాను ముస్లిమేతర ఎంపీ అయినప్పటికీ అక్కడి ముస్లీం మహిళలు తనను చాలా బాగా ఆదరించారని, దేశాభివృద్దికోసం, తాలిబన్లకు వ్యతిరేకంగా పార్లమెంట్‌లో అనేకమార్లు మాట్లాడినట్లు ఆమెతెలిపారు. తాలిబన్లకు వ్యతిరేకంగా ఢిల్లీ నుంచే పోరాటం చేస్తానని అన్నారు.
అక్కడి నుంచి పిడికెడు మట్టి కూడా తేలేకపోయా… ఆఫ్ఘన్ సిక్కు మహిళా ఎంపీ ఆవేదన…
