Woman Pilot: తన ఇంట్లో పనిచేస్తున్న చిన్నారిని వేధించిన మహిళా పైలట్‌పై చర్యలు తీసుకుంటున్నట్టు ఇండిగో సంస్థ ప్రకటించింది. తనను విధుల నుంచి తొలగించి పక్కనబెడుతున్నట్టు ఇండిగో సంస్థ ప్రకటించింది. ఇండిగోకు చెందిన ఓ మహిళా పైలట్‌ను, ఆమె భర్తను కొందరు చితకబాదిన వీడియో బుధవారం వైరల్ అయిన విషయం తెలిసిందే. తమ ఇంట్లో పని చేసే పదేళ్ల చిన్నారిని వేధిస్తున్నారని.. శారీరకంగా గాయపర్చానే కారణంతో ఆ చిన్నారి బంధువులు మహిళా పైలట్‌తోపాటు.. ఆమె భర్తపై దాడి చేసిన విషయం తెలిసిందే.
Read also: Sitara Ghattamaneni: తండ్రి బాటలోనే సితారా… పుట్టిన రోజున సాయం చేసింది
ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఇండిగో ఎయిర్‌లైన్స్ కీలక నిర్ణయం తీసుకుంది. సదరు పైలట్‌ను విధుల నుంచి పక్కనపెడుతున్నట్లు ప్రకటించింది. ఈ ఘటనపై దర్యాప్తు అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఢిల్లీ ద్వారకా ప్రాంతంలో తాజాగా ఈ ఘటన చోటు చేసుకుంది. రెండు నెలలుగా ఆ చిన్నారిని వాళ్లు వేధిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఆమె భర్త కూడా అదే ఎయిర్‌లైన్స్‌లో పని చేస్తుండగా.. ఆయన విషయంలో మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ ప్రకటించలేదు. పైలట్‌పై ఇండిగో సంస్థ చర్యలు తీసుకున్నప్పటికీ.. ద్వారకా పోలీస్ స్టేషన్‌లో ఆ జంటపై కేసు కూడా నమోదు అయ్యింది. దాడి విషయంలో విస్తారా ఉద్యోగి ప్రమేయం ఉన్నందున హింస హక్కుల దుర్వినియోగం జరిగినట్లు తమ దృష్టికి వచ్చిందని..తాము చట్టం మరియు అమలు సంస్థలకు పూర్తి మద్దతునిస్తామని సంస్థ ప్రకటించింది. ఈలోగా తాము ఉద్యోగిని తమ విధుల నుండి తొలగించామని ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. నైరుతి ఢిల్లీలోని ద్వారకలో తమ ఇంట్లో ఇంటి పనిమనిషిగా పనిచేస్తున్న 10 ఏళ్ల బాలికను కొట్టినందుకు పైలట్ మరియు ఆమె భర్తను బాధిత బంధువులు కొట్టినట్లు పోలీసులు తెలిపారు. మైనర్‌పై దాడికి పాల్పడినందుకు దంపతులను అరెస్టు చేశామని.. అలాగే దంపతులపై దాడి చేసిన వారిపై కూడా ఫిర్యాదు వచ్చినందున ..జంటపై అసభ్యంగా ప్రవర్తించిన వారిపై కూడా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
