ఇప్పటికే ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆప్ పార్టీ ఇతర రాష్ట్రాల్లోకి మెల్లిగా ప్రవేశించేందుకు సిద్ధమవుతున్నది. దేశంలో బీజేపీకి మెల్లిగా ఎదురుగాలులు వీస్తుండటం, కాంగ్రెస్ పార్టీ బలహీనపడతంతో ఆప్ ఎలాగైనా దీనీని సద్వినియోగం చేసుకోవాలని చూస్తున్నది. ఇందులో భాగంగానే ఆప్ హర్యానాలో పోటీ చేసింది. అదే విధంగా పంజాబ్ రాష్ట్రంలో కూడా అడుగుపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నది. ఇందులో భాగంగానే ఆప్ ఉచిత విద్యుత్ అంశాన్ని తెరమీదకు తెచ్చింది.
Read: షూటింగ్ పూర్తి చేసుకున్న “శ్యామ్ సింగ రాయ్”
ఢిల్లీలో సమర్ధవంతంగా అమలు చేస్తుండటంతో మిగతా రాష్ట్రాల్లో కూడా ఢిల్లీ తరహా ఉచిత విద్యుత్‌కు ప్రయత్నాలు మొదలుపెట్టింది ఆప్. వచ్చే ఏడాది యూపీ, గోవా, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో కూడా పార్టీ పోటీ చేసేందుకు సన్నాహాలు మొదలుపెట్టింది. అధికారంలోకి వస్తే గృహ వినియోగదారులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని, రైతులకు నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తామని తెలిపారు. ఉచిత విద్యుత్ అంశంతో పాటుగా, మరిన్ని పథకాలు కూడా ఆయా రాష్ట్రాల్లో ప్రకటించేందుకు పార్టీ సిద్దం అవుతున్నది.
