Aadhaar Free Update Deadline: ఆధార్ అప్‌డేట్ డెడ్‌లైన్‌ మిస్ అయితే ఇబ్బందులే.. UIDAI కీలక సూచనలు

Aadhar

Aadhar

Aadhaar Free Biometric Update Deadline: ఆధార్‌ ఫ్రీ అప్‌డేట్‌ విషయంలో యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) కీలక ప్రకటన చేసింది.. 5 నుంచి 17 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు తప్పనిసరి బయోమెట్రిక్ అప్‌డేట్‌ను 2026 సెప్టెంబర్ 30 వరకు ఉచితంగా చేసుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత వర్తించే రుసుములు చెల్లించాల్సి రావచ్చు. ఐదు సంవత్సరాల లోపు పిల్లల ఆధార్ నమోదు సమయంలో వేలిముద్రలు, కనుపాపల వివరాలు తీసుకోరు. పిల్లలకు ఐదేళ్లు నిండినప్పుడు ఫొటో, వేలిముద్రలు, రెండు కనుపాపల వివరాలతో తొలి తప్పనిసరి బయోమెట్రిక్ అప్‌డేట్ చేయాలి. అలాగే 15 ఏళ్లు నిండినప్పుడు మరోసారి బయోమెట్రిక్ వివరాలను అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. UIDAI ప్రకారం 5–7, 15–17 ఏళ్ల వయస్సు మధ్య జరిగే నిర్దేశిత బయోమెట్రిక్ అప్‌డేట్లు ఉచింగా ఉంటాయి..

7–15 ఏళ్ల పిల్లలకు కూడా ఉచిత అవకాశం

7 నుంచి 15 ఏళ్ల మధ్య పిల్లల తొలి తప్పనిసరి బయోమెట్రిక్ అప్‌డేట్‌కు UIDAI ప్రత్యేకంగా ఫీజు మినహాయింపు ఇచ్చింది. ఈ అవకాశం 2025 అక్టోబర్ 1 నుంచి ఒక సంవత్సరం పాటు అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం 5–17 ఏళ్ల పిల్లలకు ఉచిత Mandatory Biometric Update అవకాశం సెప్టెంబర్ 30, 2026 వరకు అందుబాటులో ఉంది.. అంటే ఈ నెల చివరితో ముగిసిపోనుంది.. కావును, తల్లిదండ్రులు లేదా సంరక్షకులు పిల్లలను సమీపంలోని ఆధార్ నమోదు కేంద్రం లేదా ఆధార్ సేవా కేంద్రానికి తీసుకెళ్లి బయోమెట్రిక్ అప్‌డేట్ చేయించవచ్చు. UIDAI అధికారిక వెబ్‌సైట్‌లో సమీప ఆధార్ కేంద్రాన్ని గుర్తించే సదుపాయం కూడా ఉంది.

అప్‌డేట్ చేయకపోతే?

పిల్లల ఆధార్ వివరాలు సకాలంలో అప్‌డేట్ చేయడం ద్వారా పాఠశాల, కళాశాల ప్రవేశాలు, స్కాలర్‌షిప్‌లు, ప్రభుత్వ పథకాలు, అలాగే వివిధ పరీక్షల సమయంలో ఆధార్ ఆధారిత గుర్తింపు ధృవీకరణలో ఎదురయ్యే సమస్యలను తగ్గించుకోవచ్చు. అందువల్ల అర్హత ఉన్న పిల్లల తల్లిదండ్రులు సెప్టెంబర్ 30లోగా ఈ ఉచిత బయోమెట్రిక్ అప్‌డేట్‌ను పూర్తి చేసుకోవాలని UIDAI సూచిస్తోంది.