Site icon NTV Telugu

నేష‌న‌ల్ ఐఏఎస్ అకాడమీలో క‌రోనా క‌ల‌క‌లం- 84 మందికి పాజిటీవ్‌…

దేశ‌వ్యాప్తంగా క‌రోనా ఉధృతి కొన‌సాగుతోంది.  వారు వీరు అనే తేడా లేకుండా ప్ర‌తి ఒక్క‌రికీ క‌రోనా సోకుతూనే ఉన్న‌ది.  ముస్సోరీలోని లాల్ బ‌హ‌దూర్‌శాస్త్రీ నేష‌న‌ల్ అకాడ‌మీ ఆఫ్ అడ్మ‌నిష్ట్రేష‌న్‌లో క‌రోనా క‌ల‌క‌లం రేగింది.  ఈ ఇనిస్టిట్యూట్‌లో శిక్ష‌ణ పొందుతున్న ట్రైనీ ఐఏఎస్ అధికారులు 84 మందికి క‌రోనా సోకింది.  నేష‌న‌ల్ అకాడ‌మీ ఆఫ్ అడ్మినిస్ట్రేష‌న్ ఈ విష‌యాన్ని తెలియ‌జేసింది.  క‌రోనా సోకిన 84 మంది ట్రైనీ ఐఏఎస్ అధికారుల‌ను స‌ప‌రేట్‌గా క్వారంటైన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.  ఐఏఎస్ అనుబంధ స‌ర్వీసుల‌తో క‌లిపి 480 మంది శిక్ష‌ణా ఐఏఎస్ బృందం గుజ‌రాత్ నుంచి డెహ్ర‌డూన్‌కు చేరుకోగా,  డెహ్ర‌డూన్‌లోని రైల్వేస్టేష‌న్‌లో అధికారుల‌కు ఆర్టీపీసీఆర్‌, పీసీఆర్ టెస్టులు నిర్వ‌హించారు.  ఈ టెస్టుల్లో 84 మందికి పాజిటివ్‌గా నిర్ధార‌ణ జ‌రిగింది.  

Read: తెలంగాణ‌లో భారీగా పెరుగుతున్న క‌రోనా కేసులు…

Exit mobile version