భారత ప్రధాని నరేంద్ర మోడీ గ్రాఫ్‌పై ఎప్పుడూ పెద్ద చర్చే జరుగుతోంది.. ర్యాంకింగ్స్‌లో ప్రధాని ఈ స్థానం వచ్చింది.. మోడీ గ్రాఫ్ ఇంత పెరిగింది.. లేదా ఇలా పడిపోయింది అనేదానిపై సర్వేలు సాగుతూనే ఉంటాయి.. ఎన్డీఏ పాలన బెటరా? యూపీఏ మంచిగా పాలించిందా? వంటి అంశాలపై కూడా సర్వేలు నిర్వహిస్తుంటారు.. తాజాగా, ఇండియాటుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే ఫలితాలు వెల్లడించింది.. ఈ సర్వే ప్రకారం మరోసారి భారత ప్రధాని గ్రాఫ్ పెరిగింది.. ఆగస్టు 2020లో 66 శాతంగా ఉన్ననరేంద్రుడి గ్రాఫ్‌ను కోవిడ్ ఘోరంగా దెబ్బకొట్టింది.. దీంతో.. జనవరి 2021కు దిగజారింది.. కానీ, మూడ్ ఆఫ్ ది నేషన్ తాజా ఫలితాల్లో మరోసారి నరేంద్ర మోడీ గ్రాఫ్ పెరిగినట్టు వెల్లడించింది.. భారత్‌లో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వ పనితీరుపై నిర్వహించిన సర్వేలో.. 59 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు..
Read Also: ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే గెలుపెవరిది? మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే ఫలితాలు
అయితే, ఆగస్టు 2021లో ఈ సంఖ్య 53 శాతానికి పడిపోయింది.. తాజా సర్వే ఫలితాల్లో ఎన్డీఏ పనితీరుపై 59 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేయడంతో.. మళ్లీ ప్రధాని నరేంద్ర మోడీ గ్రాఫ్ పెరిగినట్టు అయ్యింది. మరోవైపు ఎన్డీఏ పాలనపై అసంతృఫ్తితో ఉన్నవారి సంఖ్య కూడా పెరిగిపోయింది.. ఆగస్టు 2021న సంతృప్తి చెందనివారి సంఖ్య 17 శాతంగా ఉంటే.. జనవరి 2022కి వచ్చేసరికి ఆ సంఖ్య అనూహ్యంగా 26 శాతానికి దూసుకెళ్లింది. ఓవైపు సంతృప్తి చెందినవారి సంఖ్య పెరగగా.. అదే సమయంలో.. అసంతృప్తుల సంఖ్య కూడా పెరిగడం ఆసక్తికరంగా మారింది.