రాబోయే రెండు సంవత్సరాల్లో 50 అమృత్ భారత్ రైళ్లను అధునాతన ఫీచర్లతో తయారు చేస్తున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. అమృత్ భారత్ రైళ్లలో మెరుగుపరిచిన కొన్ని ముఖ్యమైన ఫీచర్లను అశ్విని వైష్ణవ్ పంచుకున్నారు. శుక్రవారం ఐసీఎఫ్‌లో కోచ్‌లను అశ్విని వైష్ణవ్ పరిశీలించారు. సీట్లు, బెర్త్‌లు, మెరుగైన లైటింగ్, ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టమ్‌లు, డైనింగ్ కార్లు, మెరుగైన మొబైల్ ఫోన్ ఛార్జింగ్ సౌకర్యాలను కలిగి ఉన్నాయి. మధ్య తరగతి కుటుంబాలే లక్ష్యంగా 50 అమృత్ భారత్ వెర్షన్ 2.0 రైళ్లు తయారు చేస్తున్నట్లు వెల్లడించారు. ఛార్జీలను త్వరలో రైల్వేబోర్డు ఖరారు చేస్తుందన్నారు.
ఇది కూడా చదవండి: Rahul Gandhi: సావర్కర్ పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి ఊరట..
ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీని జనరల్ మేనేజర్ సుబ్బారావుతో కలిసి వైష్ణవ్ పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా ప్రజలకు సేవ చేయాలని, ప్రజల సంక్షేమం కోసం చర్యలు తీసుకోవడానికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు. అమృత్ భారత్ వెర్షన్ 2.0 చూసినందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు. అమృత్ భారత్ వెర్షన్ 1.0ను గత జనవరి 2024లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారని, గత ఏడాది అనుభవం ఆధారంగా అమృత్ భారత్ వెర్షన్ 2.0లో అనేక మెరుగులు చోటు చేసుకున్నాయని వైష్ణవ్ తెలిపారు. దాదాపు 12 ప్రధాన మెరుగుదలలు కనిపించాయి.
ఇది కూడా చదవండి: Daaku Maharaj: థమన్ అంటే అంతేరా.. బాక్సులు బద్దలు అవ్వాల్సిందే!