Site icon NTV Telugu

Jobs: ఇంటర్ చదివిన వారికి గుడ్ న్యూస్.. 5వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

ఇంటర్ చదివిన వారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీ కోసం ప్రతి ఏటా వివిధ పోటీ పరీక్షలు జరుగుతాయి. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఈ పరీక్షలను నిర్వహిస్తోంది. దేశంలో ఏడు ప్రధాన నగరాల్లో దీనికి జోనల్ ఆఫీసులు ఉన్నాయి. చెన్నై, బెంగళూరు, ఢిల్లీ, కోల్‌కతా, గువాహటి, అల్‌హాబాద్, ముంబైలో ఈ కార్యాలయాలు ఉన్నాయి. చండీగఢ్, రాయ్‌పుర్‌లో సబ్ జోనల్ ఆఫీసులు ఉన్నాయి. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ తాజాగా ప్లస్ 2 లెవల్ పరీక్షకు నోటిఫికేషన్ విడుదల చేసింది. 2022 ఫిబ్రవరి 1 నుంచి మార్చి 7 వరకు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అధికారిక వెబ్‌సైట్‌ ssc.nic.in.లో ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రస్తుత నోటిఫికేషన్ ప్రకారం 5 వేల ఖాళీలు ఉన్నాయి. దరఖాస్తు ఫీజు రూ.100. మార్చి 7లోగా అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆన్‌లైన్ పేమెంట్‌కు చివరి తేదీ మార్చి 8. ఆఫ్‌లైన్ ఛలానా డౌన్‌లోడ్ డెడ్‌లైన్ తేదీ మార్చి 9. ఆఫ్‌లైన్ ద్వారా ఛలానా చెల్లించేందుకు చివరితేదీ మార్చి 10. మే నెలలో ప్రిలిమినరీ పరీక్ష ఉంటుంది.

Exit mobile version