NTV Telugu Site icon

JK: విషాదం.. లోయలో పడ్డ ఆర్మీ వాహనం.. ఐదుగురు జవాన్ల మృతి

Army

Army

జమ్మూకాశ్మీర్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. 300 అడుగుల లోయలో ఆర్మీ వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 5 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న జమ్మూకాశ్మీర్ పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు.

మంగళవారం జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్‌లో ఆర్మీ ట్రక్కు రోడ్డుపై వెళ్తుండగా హఠాత్తుగా అదుపు తప్పి 300 అడుగుల లోయలో పడిపోయినట్లుగా సమాచారం. ఘటనాస్థలిలో ఐదుగురు సైనికులు మరణించగా, పలువురు గాయపడినట్లు అధికారులు తెలిపారు. జిల్లాలోని బనోయికి ఆర్మీ వాహనం వెళ్తుండగా ఘరోవా ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. ప్రమాదంలో చనిపోయిన మృతులకు ఇండియన్ ఆర్మీ సంతాపం తెలిపింది. ఈ మేరకు ఎక్స్ ట్విట్టర్‌లో సానుభూతిని తెలియజేసింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, గాయపడిన సిబ్బందికి వైద్యసేవలు అందిస్తున్నామని ఆర్మీ తెలిపింది.