Nuh Violence: గత నెలలో హర్యానాలోని నుహ్ జిల్లాలో మతపరమైన ఘర్షణలు జరిగిన విషయం తెలిసిందే. నుహ్‌లో జరిగిన మత ఘర్షణల ప్రభావం దేశ రాజధాని ఢిల్లీలో జరగకుండా చూడాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని సైతం ఆదేశించింది. మత ఘర్షణలు ఢిల్లీలో జరిగితే ప్రమాదం ఏర్పడుతుందని సుప్రీం ఆందోళన వ్యక్తం చేసింది. ఘర్షణలను వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్ వంటి సంస్థలు ఉపయోగించుకొని హింసను ప్రరేపించే అవకాశం ఉంటుందని కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో సుప్రీంకోర్టు ఘర్షణలను నివారించేలా చూడాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో గత నెలలో జరిగిన మత హింసకు సంబంధించి పోలీసులు 170 మందిని అరెస్టు చేశారు. ఘర్షణలపై 57 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. ప్రస్తుతం నుహ్ జిల్లాలో ప్రశాంత వాతావరణం నెలకొన్న నేపథ్యంలో నేటి నుంచి బస్సులను ప్రారంభించారు. శాంతియుత వాతావరణం నెలకొనడంతో కొన్ని గంటల పాటు కర్ఫ్యూను సడలిస్తూ జిల్లా అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ప్రజలు బయటకు వెళ్లి నిత్యావసర వస్తువులను కొనుగోలు చేయడానికి అనుమతించారు. జిల్లాలోని మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బ్యాంకులు, ఏటీఎంలు మధ్యాహ్నం 3 గంటల వరకు పనిచేయనున్నాయి.
Read alsoఫ Devara : ఆ పక్కా యాక్షన్ సినిమాకు సీక్వెల్ కూడా రాబోతుందా..?
జూలై 31న నుహ్‌లో విశ్వహిందూ పరిషత్ (VHP) ఊరేగింపును అడ్డుకునే ప్రయత్నంలో చెలరేగిన ఘర్షణల్లో ఇద్దరు హోంగార్డులు, ఒక మత గురువుతో సహా ఆరుగురు మరణించిన విషయం తెలిసిందే. ఘర్షణల నేపథ్యంలో పలువురు పోలీసు అధికారులను ప్రభుత్వం బదలీ చేసింది. డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్(డీఎస్‌పీ) నూహ్.. జై ప్రకాష్‌ను బదిలీ చేశారు. పోలీసు సూపరింటెండెంట్(ఎస్‌పీ) వరుణ్ సింగ్లా మరియు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్(డీసీపీ) ప్రశాంత్ పన్వార్‌లను నుహ్ నుండి బదిలీ చేశారు. జిల్లాలో మత ఘర్షణలు చెలరేగినప్పుడు సింగ్లా సెలవులో ఉన్నారు. అతన్ని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్(ఎస్‌పీ)గా భివానీకి నియమించారు. నుహ్ కొత్త సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (SP)గా నరేంద్ర బిజర్నియాను నియమిస్తూ ఆగస్ట్ 3న ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది.