US deports Indians: డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆ దేశంలో అక్రమంగా నివసిస్తున్న వలసదారుల్ని వారి దేశాలకు బహిష్కరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇల్లీగల్ భారతీయ వలసదారులను కూడా అమెరికా బహిష్కరించింది. తాజాగా, 4వ బ్యాచ్ అక్రమ వలసదారులతో కూడిన విమానం ఈ రోజు ఇండియాకు చేరింది. న్యూఢిల్లీలో ల్యాండ్ అయిన విమానంలో 12 మంది అక్రమ వలసదారులు ఉన్నారు. వీరిలో నలుగురు పంజాబ్ అమృత్ సర్ వెళ్లారని అధికారులు తెలిపారు. ముగ్గురు హర్యానా, ముగ్గురు యూపీకి చెందిన వారిగా గుర్తించారు. పనామా మీదుగా వీరంతా భారత్ చేరారు.
Read Also: Ind vs Pak : ఇండియా పాక్ మ్యాచ్ లో సెలబ్రిటీల హవా
ఫిబ్రవరి 05న మొదటి రౌండ్ అక్రమ భారతీయ వలసదారుల బహిష్కరణ జరిగింది. అమెరికన్ సైనిక విమానంలో 104 మంది భారతీయులను అమృత్‌సర్ తీసుకువచ్చింది. అమెరికా బహిష్కరించడిన 300 మంది వలసదారులను పనామాలోని ఒక హోటల్‌లో ఉంచారు. అధికారులు వీరిని వారి వారి స్వదేశాలకు పంపేందుకు కృషి చేస్తున్నారు. 40 శాతం మంది స్వచ్ఛందంగా తమ స్వదేశానికి తిరిగి వెళ్లడానికి నిరాకరిస్తున్నందున, యూఎన్ ఏజెన్సీలు ప్రత్యామ్నాయ గమ్యస్థానాలను వెతుకుతున్నాయి. పనామా ప్రస్తుతం రవాణా కేంద్రంగా మారింది. పనామా నుంచి ఇటీవల వచ్చిన భారతీయ పౌరుల బృందం టర్కీష్ ఎయిర్‌లైన్స్ విమానంలో ఇస్తాంబుల్ మీదుగా న్యూఢిల్లీకి చేరారు.