Site icon NTV Telugu

Nithya Menen: నిత్యా గురించి ఆ విషయాలు తెలిసుంటే.. ప్రేమించే వాడినే కాదు

Nithya Menen Santosh

Nithya Menen Santosh

Youtuber Santosh Verkey Comments On Nithya Menen: కొన్ని రోజుల నుంచి సినీ పరిశ్రమలో నిత్యామీనన్ ‘పెళ్లి’ విషయం హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే! తొలుత ఈమె ఒకబ్బాయిని పెళ్లి చేసుకోబోతోందని టాక్ వినిపించింది. అందులో వాస్తవం లేదని ఆ వెంటనే నిత్యా క్లారిటీ ఇచ్చింది. అనంతరం తాను నిత్యాని కొన్నాళ్లుగా ప్రేమిస్తున్నానని, ఆమెని పెళ్లి చేసుకోబోతున్నాననంటూ సంతోష్ వర్కీ అనే వ్యక్తి బాంబ్ పేల్చాడు. దీంతో.. ‘ఇదెక్కడ ట్విస్ట్‌రా మావా’ అంటూ ఆడియన్స్ ఆశ్చర్యచకితులు అయ్యారు. అయితే, ఇది చినికి చినికి గాలివానగా మారడానికి ముందే, నిత్యామీనన్ ఆ వార్తల్ని ఖండించింది.

ఆరేళ్ల నుంచి సంతోష్ వర్కీ తనని వేధిస్తున్నాడని, ఇప్పటివరకూ 30కి పైగా నంబర్స్‌ నుంచి కాల్‌ కాసి విసిగించాడని నీత్యా పేర్కొంది. సంతోష్ వర్కీ మాటలు వినే వారు మూర్ఖులని ఘాటుగా స్పందించిన ఈ బ్యూటీ.. సంతోష్ తనని చికాకు పెడుతున్నప్పటికీ పోలీసులకు ఫిర్యాదు చేయ‌కుండా అతడ్ని క్షమించానని చెప్పింది. ఇందుకు సంతోష్ తాజాగా స్పందించాడు. 30కి పైగా నంబర్ల నుంచి కాల్ చేసి, చిత్రహింసలకు గురిచేశానని నిత్యా చేసిన ఆరోప‌ణ‌ల్లో ఏమాత్రం వాస్తవం లేదన్నాడు. ఒక్క వ్యక్తి తన పేరు మీద ఎన్ని సిమ్‌కార్డులు కొంటాడో జనాలు ఊహించుకోవాల‌ని అన్నాడు. ఇంతటితో ఆగకుండా.. మరికొన్ని షాకింగ్ కామెంట్స్ చేశాడు.

గతంలో నిత్యామీనన్ అంటే నాకెంతో ఇష్టం ఉండేది. ఆమెని పెళ్లి చేసుకోవాలని బలంగా ఫిక్సయ్యా. కానీ, ఇప్పుడు చచ్చినా పెళ్లి చేసుకోను. నిత్యా మీనన్‌కు వేరే వ్యక్తితో నిశ్చితార్థం అయ్యిందని ఆమె తల్లి చెప్పింది. కానీ, తండ్రి మాత్రం జరగలేదని చెప్పారు. అప్పుడు నేను చాలా కంగారు పడ్డాను. ఆ తర్వాత వాళ్లు నాపై లైంగిక వేధింపుల కేసు పెట్టబోతున్నారని తెలిసింది. నిత్యా గురించి ఈ విషయాలన్నీ ముందే తెలిసి ఉంటే, ఆమెతో ప్రేమలో పడేవాడినే కాదు’’ అంటూ సంతోష్ తెలిపాడు. అయితే.. నెటిజన్లు అతడ్ని ఏకిపారేస్తున్నారు. నువ్వు నిత్యాని రిజెక్ట్ చేయడమేంటని ట్రోల్ చేస్తున్నారు.

Exit mobile version