Youtuber Angry Rantman Died due to Multi Organ Failure: ఈ మధ్యకాలంలో రెగ్యులర్ సినిమా క్రిటిక్స్ తో పాటు యూట్యూబ్లో రివ్యూస్ చెబుతూ కొంతమంది ఫేమస్ అవుతున్నారు. అలాంటి వారిలో యాంగ్రీ ర్యాంట్ మాన్ కూడా ఒకరు. ఈయన అసలు పేరు అబ్రదీప్ సహా. తాజాగా ఆయన అనారోగ్యంతో కన్నుమూసినట్లుగా తెలుస్తోంది. గత కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నట్టుగా సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తాయి. ఆయన అనారోగ్య పరిస్థితుల నేపథ్యంలో హాస్పిటల్ ఖర్చులు కూడా ఇబ్బంది అవుతున్న నేపథ్యంలో కొంతమంది సహాయం చేయాలని కూడా ఆయన స్నేహితులు సన్నిహితులు కోరారు. అయితే తాజాగా ఆయన కన్నుమూసినట్లుగా తెలుస్తోంది. అతని వయసు ప్రస్తుతం 27 సంవత్సరాలు మాత్రమే.
Thandel: భలే డేట్ పట్టేసిన మేకర్స్
కొన్నాళ్ల క్రితం ఒక సర్జరీ జరిగినట్లుగా తెలుస్తోంది. ఆ సర్జరీ జరిగిన తర్వాత పూర్తిస్థాయిలో అనారోగ్యం ఏర్పడినట్లుగా చెబుతున్నారు. కొద్ది రోజులుగా బెంగళూరు హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఈరోజు కన్నుమూశాడు. తనదైన యాంగ్రీ స్టైల్లో సినిమాలతో పాటు క్రికెట్, ఫుట్బాల్ వంటి విషయాల మీద కూడా రివ్యూస్ ఇస్తూ ఉండేవాడు అబ్రదీప్. ఇప్పుడు ఆయన అనారోగ్యంతో కన్నుమూయడంతో అతని ఫాలో అయ్యే వారందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇంత చిన్న వయసులో అనారోగ్య కారణాలతో మృతి చెందడం ఏమిటి అంటూ అందరూ షాక్ అవుతున్నారు. అయితే అబ్రదీప్ మృతికి మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ కారణమని చెబుతున్నారు. అయితే ఈ విషయం మీద అధికారికంగా ప్రకటిస్తే తప్ప అసలు నిజంగా ఏం జరిగిందనే విషయం మీద క్లారిటీ వచ్చే అవకాశం కనిపించడం లేదు.
