NTV Telugu Site icon

Yashoda: సమంత ఓకే అంటే ‘యశోద’ సీక్వెల్ – సక్సెస్‌మీట్‌లో దర్శక నిర్మాతలు

Yashoda Sequel

Yashoda Sequel

Yashoda Producers Ready To Make Yashoda Sequel: సమంత టైటిల్ పాత్రలో నటించిన సినిమా ‘యశోద’. శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించగా హరి, హరీష్ దర్శకత్వం వహించారు. ఇటీవల ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదలైంది. ఫస్ట్ డే ఆరున్నర కోట్ల గ్రాస్, మూడు రోజుల్లో 20 కోట్లకు పైగా వసూళ్ళు సాధించటమే కాకుండా అమెరికాలో హాఫ్‌ మిలియన్ మార్క్ చేరుకుంది. ఈ సందర్భంగా సక్సెస్ మీట్ నిర్వహించారు. అందులో నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ‘సమంత వన్ విమన్ షో ‘యశోద’. ప్రతి ఒక్కరి జీవితంలో మబ్బులు ఉంటాయి. ఆవిడ మళ్ళీ సూపర్ ఎనర్జీతో వస్తారు. ‘యశోద 2′ గురించి చాలా మంది అడుగుతున్నారు. సీక్వెల్ ప్రయత్నం హరి, హరీష్ నుంచి రావాలి. మంచి సినిమా తీస్తే విజయం అందిస్తామని కాన్ఫిడెన్స్ ఇచ్చిన ప్రేక్షకులకు థాంక్స్. ప్రమోషనల్ సాంగ్ చేశాం. త్వరలో విడుదల చేస్తాం’ అని అన్నారు.

వరలక్ష్మీ శరత్ కుమార్ మాట్లాడుతూ ‘కింగ్‌డమ్‌లో ఒక కింగ్ ఉంటారు. జనరల్ ఒకరు ఉంటారు. ‘యశోద’కు కింగ్ హరి, హరీష్ అయితే జనరల్ సమంత. ఈ సక్సెస్ మీట్ లో ఆవిడను మిస్ అవుతున్నాం. ఇంత పెద్ద విజయాన్ని అందించిన ప్రేక్షకులకు థాంక్స్’ అని చెప్పారు. దర్శకులు హరి, హరీష్ మాట్లాడుతూ ‘తెలుగులో మాకిది తొలి సినిమా. అన్ని భాషల నుంచి వస్తున్న స్పందన సంతోషాన్నిచ్చింది. మాకు ఇది మ్యాజికల్ మూమెంట్. అవకాశం ఇచ్చిన కృష్ణప్రసాద్ గారికి, సమంత గారికి చాలా పెద్ద థాంక్స్. వరలక్ష్మీ వెర్సటైల్ యాక్టర్. మణిశర్మ అద్భుతమైన నేపథ్య సంగీతం అందించారు. ‘యశోద 2′ విషయంలో మాకు ఒక ఐడియా ఉంది. సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్‌కు లీడ్ కూడా ఉంది. అయితే అది సమంతపై ఆధారపడి ఉంది. పూర్తి ఆరోగ్యంతో తిరిగి వచ్చిన తర్వాత ఆవిడతో డిస్కస్ చేస్తాం. ఒప్పుకుంటే సీక్వెల్స్ చేస్తాం. అందులో వరలక్ష్మి క్యారెక్టర్ కూడా ఉంటుంది’ అని తెలిపారు.

రచయితలు పులగం చిన్నారాయణ, డా. చల్లా భాగ్యలక్ష్మి మాట్లాడుతూ ‘ఈ క్షణం ఇక్కడ నిలబడటానికి కారణం మా నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్. రాయగలరు. రాయండి. మీ ఇద్దరూ సక్సెస్ అయితే చూడాలని ఉందని మమ్మల్ని ఆశీర్వదించారు. తమిళ్ తెలిసిన అమ్మాయి, తెలుగు నేటివిటీ తెలిసిన అబ్బాయి కలిసి పని చేస్తే బావుంటుందని కథకు న్యాయం చేస్తారని ఆయన అన్నారు. సినిమాకు కొత్త రచయితలతో మాటలు రాయించుకోవడానికి యాక్సెప్ట్ చేసిన సమంతకి ధన్యవాదాలు’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇతర నటీనటులు, సాంకేతికనిపుణులు కూడా పాల్గొని సినిమా విజయం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు.

Show comments