కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ చూసిన మొదటి పాన్ ఇండియా హీరోగా పేరు తెచ్చుకున్నాడు రాకింగ్ స్టార్ యష్. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన KGF ఫ్రాంచైజ్ తో నార్త్ ఆడియన్స్ కి విపరీతంగా దగ్గరైన యష్, ఈ మూవీ తర్వాత కంప్లీట్ గా సైలెంట్ గా ఉన్నాడు. ఏడాదిన్నర దాటినా కూడా యష్ మాత్రం నెక్స్ట్ ప్రాజెక్ట్ అప్డేట్ చెప్పకుండ చాలా సైలెంట్ గా ఉన్నాడు. యష్ నెక్స్ట్ సినిమా కోసం పాన్ ఇండియా ఆడియన్స్ అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. జనవరి 8న తన పుట్టిన రోజున అయినా యష్ నెక్స్ట్ ప్రాజెక్ట్ అప్డేట్ ఇస్తాడు అని ఫాన్స్ ఈగర్ గా వెయిట్ చేసారు కానీ యష్ అప్డేట్ ఇవ్వకుండా డిజప్పాయింట్ చేసాడు. అసలు యష్, నెక్స్ట్ సినిమా ఎవరితో చేస్తున్నాడు అనే ప్రశ్నకి సమాధానం కూడా ఎవరికీ తెలియట్లేదు. ఎందుకంటే ఒకసారి ‘మఫ్టీ’ ఫేమ్ ‘నర్తన్’ పేరు, ఇంకోసారి పూరి జగన్నాథ్ పేరు, ఇటీవలే గీతూ మోహన్ దాస్ పేరు కూడా వినిపిస్తూనే ఉన్నాయి.
డిసెంబర్ నెలలో ‘యష్ 19’ సినిమా పూజా కార్యక్రమాలతో స్టార్ట్ అవ్వనుంది అనే మాట వైరల్ అవుతోంది. అయితే అసలు యష్ తర్వాతి సినిమాని ఎవరు డైరెక్ట్ చేస్తున్నారు అనేది సమాధానం లేని మిలియన్ డాలర్ ప్రశ్నగా మిగిలిపోయింది. రోజులు గడుస్తూనే ఉన్నాయి కానీ యష్ 19 విషయంలో మాత్రం క్లారిటీ రావట్లేదు. యష్ అసలు ఎవరిని కలుస్తున్నాడు? ఎవరితో డిస్కస్ చేస్తున్నాడు? ఎవరి కథకి ఓకే చెప్పాడు? ఇలా యష్ 19 ప్రాజెక్ట్ చుట్టూ చాలా డైలమా ఉంది. లేటెస్ట్ గా కన్నడ మీడియాలో వినిపిస్తున్న టాక్ ని బట్టి చూస్తే ఈ ప్రశ్నలకి సమాధానం దొరికేలా కనిపిస్తుంది. KGF సినిమాలో రాఖీ భాయ్ గా కనిపించిన యష్, తన నెక్స్ట్ సినిమాలో ‘ఛత్రపతి శివాజీ’గా నటిస్తున్నాడని సమాచారం. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కనున్న ఈ మూవీ ‘ఛత్రపతి శివాజీ’ వీరోచిత చరిత్ర ఆధారంగానే తెరకెక్కుతోందని టాక్. ఈ కారణంగానే అనౌన్స్మెంట్ కి టైమ్ తీసుకోని, పక్కాగా స్క్రిప్ట్ వర్క్ అండ్ ప్రీప్రొడక్షన్ చేసిన తర్వాతే అనౌన్స్మెంట్ ఇవ్వాలని యష్ భావిస్తున్నాడట. అందుకే యష్ 19 అనౌన్స్మెంట్ డిలే అవుతుందని, ఇందుకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుందని కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్. మరి ‘ఛత్రపతి శివాజీ’గా యష్ ఎలా కనిపిస్తాడు? ఎప్పుడు సినిమాని అనౌన్స్ చేస్తాడు? అనేది చూడాలి.
