Site icon NTV Telugu

Mangli: మరో మాసీ నెంబర్ తో వచ్చేసిన మంగ్లీ.. యాడున్నాడో అంటూ!

Attack On Singer Mangli

Attack On Singer Mangli

Yaadunnado Lyrical Song from Theppa Samudram Sung by Mangli Released: అర్జున్ అంబటి, చైతన్య రావు హీరోలుగా కొరమేను ఫేమ్ కిశోరి దాత్రక్ హీరోయిన్ గా రవి శంకర్ ప్రధాన పాత్రలో ‘తెప్ప సముద్రం’ అనే పేరుతో సినిమా తెరకెక్కుతోంది. సతీష్ రాపోలు దర్శకత్వంలో శ్రీమణి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నీరుకంటి రాఘవేందర్ గౌడ్ ఈ నిర్మించిన ఈ సినిమాకి పి.ఆర్ మ్యూజిక్ అందించాడు. వినాయక చవితి సందర్భంగా సినీ ప్రేక్షకులను తన గాత్రంతో ఉర్రూతలూగిస్తున్న సింగర్ మంగ్లీ పాడిన మాస్ బీట్ పాట “యాడున్నాడో”ని ఎమ్ఆర్టి (MRT) ఆడియో ద్వారా విడుదల చేశారు మేకర్స్. ఈ సందర్భంగా నిర్మాత రాఘవేందర్ గౌడ్ మాట్లాడుతూ “తెప్ప సముద్రం” కథ బాగా నచ్చి ఖర్చుకు వెనుకాడకుండా నిర్మించడం జరిగిందని సినిమా కూడా అద్భుతంగా వచ్చిందని అన్నారు.

Telugu Hero Raja: బ్రేకింగ్: కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న టాలీవుడ్ హీరో

సింగర్ మంగ్లీ పాడిన మాస్ బీట్ పాట “యాడున్నాడో” ను ఎమ్ ఆర్ టి (MRT) ఆడియో ద్వారా విడుదల చేశామనీ దానికి మంచి రెస్పాన్స్ వచ్చిందని, అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలోనే సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటిస్తాం అని చెప్పుకొచ్చారు. దర్శకుడు సతీష్ రాపోలు మాట్లాడుతూ తెప్ప సముద్రం కథ చాలా కొత్తగా ఉంటుందని, మంచి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ఏమో అన్నారు. మంగ్లీ పాడిన యాడున్నాడో పాటకి మంచి రెస్పాన్స్ వచ్చిందని ఈ క్రమంలో సినిమా మీద కూడా నమ్మకం పెరిగిందని ఆయన అన్నారు. ఇక పి.ఆర్ గారు అద్భుతమైన పాటలు అందించారని, సినిమాని త్వరలోనే విడుదల చేస్తామని తెలిపారు. ఇక యాడున్నాడో సాంగ్ కూడా మంగ్లీ మార్క్ తో ఉంది. తెలంగాణ యాసలో సాగుతున్న ఈ సాంగ్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది.

Exit mobile version