Site icon NTV Telugu

Thala Ajith: AK62 గురించే సౌండ్ లేదు… ఇక అప్పుడే AK63 గురించి మాట్లాడుతున్నారు

Ajith

Ajith

సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత కోలీవుడ్ లో ఆ రేంజ్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో విజయ్ అండ్ అజిత్ టాప్ ప్లేస్ లో ఉంటారు. ముఖ్యంగా అజిత్ కి మాస్ లో ఉన్న ఫాలోయింగ్ కి వేరే ఏ హీరోకి లేదు. స్టార్ ఇమేజ్ అండ్ యాక్టింగ్ స్కిల్స్ కూడా పర్ఫెక్ట్ గా ఉండే ఏకైక కోలీవుడ్ హీరో అజిత్ మాత్రమే. తల అజిత్ అంటూ అభిమానులు ప్రేమగా పిలుచుకునే ఈ హీరో ఏ సినిమా చేసినా, ఏ దర్శకుడితో చేసినా ఆ మూవీ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉంటారు. అప్డేట్ ఇవ్వడంలో మేకర్స్ ఏదైనా డిలే చేస్తే మాత్రం సోషల్ మీడియాలో నేషనల్ వైడ్ ట్రెండ్ చేస్తూ చుక్కలు చూపిస్తారు. బోణీ కపూర్ నుంచి లైకా ఎంటర్టైన్మెంట్స్ వరకూ ప్రతి ఒక్కరూ అజిత్ ఫ్యాన్స్ దెబ్బకి సోషల్ మీడియాలో బెబ్బెలెత్తిన వాళ్లే.

లేటెస్ట్ గా అజిత్ తన నెక్స్ట్ సినిమాని మజిల్ తిరుమేణి దర్శకత్వంలో చేస్తున్నాడు. ఈ సినిమా చాలా ఆలస్యం తర్వాత ఇటీవలే సెట్స్ పైకి వెళ్లింది. AK62 అనే వర్కింగ్ టైటిల్ తో అనౌన్స్ అయిన ఈ సినిమాకి మేకర్స్ ‘విడ ముయార్చి’ అనే టైటిల్ ని ఫిక్స్ చేసారు. ప్రస్తుతం విడ ముయార్చి రెగ్యులర్ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమా నుంచి అప్డేట్ ఎప్పుడు వస్తుందా అని అజిత్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఒక వర్గం అజిత్ ఫ్యాన్స్ మాత్రం AK63 అప్డేట్ ఎప్పుడు అనౌన్స్ అవుతుంది? ఎవరితో చేస్తున్నాడు? అనే ప్రశ్నలు వేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిన అజిత్ నెక్స్ట్ సినిమా దర్శకుడు టాపిక్ లో వెట్రిమారన్, సూపర్ డీలక్స్ డైరెక్టర్ త్యాగరాజన్ కుమార రాజన్ పేర్లు వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరిలో ఎవరితో అజిత్ నెక్స్ట్ సినిమా ఉంటుంది అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. మేకర్స్ నుంచి అఫీషియల్ అప్డేట్ వచ్చే వరకూ అజిత్ నెక్స్ట్ సినిమా ఎవరితో చేస్తాడు అనేది బేతాళ ప్రశ్న అనే చెప్పాలి.

Exit mobile version