Site icon NTV Telugu

MSMP: అనుష్కతో మాట్లాడే లక్కీ ఛాన్స్… ఆ లక్కీ లేడీస్ కి మాత్రమే

Msmp

Msmp

యంగ్ సెన్సేషన్ నవీన్ పోలిశెట్టి హీరోగా, లేడీ సూపర్ స్టార్ అనుష్క శెట్టి హీరోయిన్ గా నటించిన సినిమా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి”. మహేష్ బాబు డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఇటీవలే రిలీజ్ అయ్యి యునానిమస్ గా హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. వర్డ్ ఆఫ్ మౌత్ పాజిటివ్ గా స్ప్రెడ్ అవడంతో రోజురోజుకీ మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి బుకింగ్స్ పెరుగుతూనే ఉన్నాయి. అన్ని సెంటర్స్ లో హౌజ్ ఫుల్ బోర్డ్స్ తో ఈ మూవీ, జవాన్ లాంటి ఇండస్ట్రీ హిట్ సినిమా ముందు కూడా రాక్ సాలిడ్ గా నిలబడింది. ఓవర్సీస్ లో వన్ మిలియన్ మార్క్ ని క్రాస్ చేసిన మిస్ శెట్టి మిస్టర్ పలిశెట్టి సినిమా ఆల్మోస్ట్ అన్ని సెంటర్స్ లో బ్రేక్ ఈవెన్ అయిపొయింది. తమ సినిమాని ఇంత హిట్ చేసినందుకు అనుష్క, లేడీస్ కోసం స్పెషల్ గిఫ్ట్ ని ఇచ్చింది.

ఈ గురువారం తెలుగు రాష్ట్రాల్లోని అన్ని థియేటర్స్ లో మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాని లేడీస్ కోసం ఫ్రీగా మార్నింగ్ షో వేయనున్నారు. ఇంట్లోని లేడీస్ తో తీసుకోని థియేటర్స్ కి రండి అంటూ అనుష్క స్పెషల్ వీడియో రిలీజ్ చేసి ఈ విషయాన్ని తెలిపింది. అయితే ఈ స్పెషల్ స్క్రీనింగ్ తో పాటు ఒక స్పెషల్ కాంటెస్ట్ కూడా పెట్టడం విశేషం… సెప్టెంబర్ 14న లేడీస్ స్పెషల్ స్క్రీనింగ్ కి వచ్చిన వాళ్లు… తమ టికెట్స్ పైన ఫోన్ నంబర్స్ వేసి థియేటర్ బయట ఏర్పాటు చేసిన బ్యాక్స్ లో వేస్తే… ప్రతి థియేటర్ నుంచి ఇద్దరినీ సెలక్ట్ చేసి వారికి నేరుగా అనుష్కతో ఫోన్ చేసి మరీ మాట్లాడే అవకాశం కలిపిస్తారట. ఒకే టికెట్ పై రెండు ఆఫర్స్ అంటే ఇదేనేమో… అటు సినిమా ఫ్రీ, ఇటు అనుష్కతో మాట్లాడే ఛాన్స్ కూడా దొరుకుతుంది… మరి ఇంకెందుకు లేట్ మీ ఫ్యామిలీ లేడీస్ ని థియేటర్స్ కి తీసుకోని వెళ్లి ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమా చూపించేయండి.

Exit mobile version