NTV Telugu Site icon

Telangana Floods: తెలంగాణ ‘రేపటి కోసం’ .. వైజయంతీ మూవీస్ ఎంత విరాళం ఇచ్చిదంటే?

Vyjayanthi Movies

Vyjayanthi Movies

Vyjayanthi Movies Announces to Donate 20 Lakhs for Telangana CM Relief Fund: తెలుగు రాష్ట్రాల వరదల నేపథ్యంలో తెలుగు సినీ పరిశ్రమ నుంచి ఇప్పటికే భారీ ఎత్తున విరాళాలు ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే అందరికంటే ముందుగా వైజయంతి మూవీస్ బ్యానర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధికి పాతిక లక్షల రూపాయలు ప్రకటించింది. ఆ తర్వాత ఎన్టీఆర్ మొదలుపెట్టి టాప్ హీరోలందరూ అటు ఆంధ్రప్రదేశ్ తో పాటు ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి నిధికి విరివిగా విరాళాలు ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలో మొన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం ప్రకటించిన వైజయంతి మూవీస్ సంస్థ. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి కూడా విరాళం ప్రకటించింది.

Devara Daavudi: అనిరుధ్ ఆగాయా… టైగర్ ఫ్యాన్స్‌కు ఫెస్ట్ మిల్ గయా!

ఆంధ్ర ప్రదేశ్ కి పాతిక లక్షల ప్రకటించగా తెలంగాణకు మాత్రం 20 లక్షలు మాత్రమే ప్రకటిస్తూ తమ ఆవేదన వ్యక్తం చేసింది. అంతేకాదు కల్కి 2988 AD సినిమాలో వాడిన రేపటి కోసం అనే డైలాగ్ మరోసారి రిపీట్ చేసింది. ఇక ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ ఏకంగా తన వ్యక్తిగతంగా 6 కోట్లు వరద బాధితుల కోసం ఇచ్చేందుకు రెడీ అవ్వడం హాట్ టాపిక్ అవుతుంది. ఇక పవన్ కళ్యాణ్ మంత్రిగా వ్యవహరిస్తున్న ఒక ప్రభుత్వ శాఖ ఉద్యోగులందరూ కలిసి 14 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేయడానికి ముందుకు రావడం కూడా చర్చనీయాంశమవుతోంది.

Show comments