Site icon NTV Telugu

VK Naresh: ఏపీ ఎన్నికలకు ముందు రక్తపాతం.. నటుడు సంచలన వ్యాఖ్యలు

Naresh

Naresh

VK Naresh Sensational tweet on AP Politics: ఆంధ్రప్రదేశ్ లో మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. 2019 ఎన్నికల తర్వాత జరగబోతున్న 2024 అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటికే అన్ని పార్టీలు హోరాహోరి పోరాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ అధికార వైసీపీ మరోసారి అధికారంలోకి రావాలని సర్వశక్తులు ఒడ్డి పోరాడుతుండగా ప్రతిపక్ష తెలుగుదేశంతో పాటు జట్టు కట్టిన జనసేన బిజెపి కూడా ఈసారి తాము అధికారంలోకి వచ్చి ఏపీకి మంచి చేస్తామని చెబుతున్నాయి. అయితే ఈ క్రమంలో ఏపీ ఎన్నికలకు ముందు రక్తపాతం జరిగే అవకాశం ఉందని సినీ నటుడు వీకే నరేష్ తాజాగా చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ లో అధికార మార్పిడి జరిగే ముందు పెద్ద రక్తపాతం జరిగే అవకాశం ఉంది అంటూ వీకే నరేష్ సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. ఇప్పుడు ఇదే విషయం మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

Summer Tips : ఎండలో వెళ్లొచ్చి వాటర్ తాగుతున్నారా? మీ ప్రాణాలు డేంజర్లో పడ్డట్లే..

గతంలో సామాజిక సేవా కార్యక్రమాలు కూడా చేసిన నరేష్ ప్రస్తుతం బిజెపిలో కొనసాగుతున్నారు. ఇక కొన్నాళ్ల క్రితం ఆయన పవిత్ర లోకేష్ తో వివాహం వ్యవహారంలో ఎక్కువగా వార్తల్లోకి వస్తూ ఉండేవారు. నరేష్ మూడవ భార్య రమ్య రఘుపతి పవిత్ర లోకేష్ తో నరేష్ పెళ్లి విషయం మీద పోలీసుల వరకు వెళ్లడంతో అనేకసార్లు అనేక విషయాల్లో వార్తలు తెరమీదకు వస్తూ ఉండేవి. అయితే ఏకంగా నరేష్ పవిత్ర లోకేష్ ఇద్దరూ కలిసి మళ్లీ పెళ్లి అనే సినిమా చేసినట్లు ప్రకటించి మరొక షాక్ ఇచ్చారు. వారిద్దరి నిజ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను తాము చెప్పాలనుకున్న విధంగా ఒక సినిమా చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాబట్టలేదు.

Exit mobile version