Site icon NTV Telugu

Vishwak Sen: షూటింగ్లో నిజమైన అఘోరా అనుకోని డబ్బులు ధర్మం చేశారు

Vishwak Sen

Vishwak Sen

Vishwak Sen Comments on Gaama Movie Shooting: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా విద్యాధర్ కాగిత దర్శకత్వంలో తెరకెక్కిన ప్రతిష్టాత్మక చిత్రం ‘గామి’. కార్తీక్ కల్ట్ క్రియేషన్స్‌పై కార్తీక్ శబరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ అడ్వెంచర్ డ్రామాని వి సెల్యులాయిడ్ సమర్పిస్తోంది. ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మేకర్స్ గామి రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ చిత్రం మార్చి 8న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలవుతున్న సందర్భంగా చిత్ర బృందం గ్రాండ్ గా ప్రెస్ మీట్ ని నిర్వహించింది. ఇక ఏ ప్రెస్ మీట్ లో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. వారణాసిలో ‘గామి’ షూటింగ్ చేస్తున్నప్పుడు ఫోన్ లో ఫలక్ నామా దాస్ టీజర్ ఎడిట్ చేస్తుండేవాడినన్నారు.

Eagle: దళం..సైన్యం కాదు.. దేశం వచ్చినా ఆపుతాను.. అదిరిపోయిన ఈగల్ ట్రైలర్

దర్శకుడు విద్యాధర్ గామి కోసం చాలా రీసెర్చ్ చేశాడని, సినిమాలోని ప్రతి ఎలిమెంట్ గురించి చాలా లోతుగా రాసుకున్నాడని అన్నారు. ఈ సినిమా మొదలుపెట్టినప్పుడే సమయం పడుతుందని తెలుసన్న విశ్వక్ దాదాపు నాలుగున్నరేళ్లు పాటు చేశామన్నారు. ఇంత సమయం ఇచ్చాము కాబట్టి మంచి సీజీ రాబట్టుకున్నారని అన్నారు. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాం, అయితే అవేమీ గుర్తు లేవన్నారు. ఇక షూట్ సమయంలో నిజంగానే కుంభమేళాలో ఒకరిద్దరు నేను అఘోర అనుకోని ధర్మం చేశారని ఆయన అన్నారు. వారణాసిలో చలికి వణుకుతూ ఓ మూల కూర్చున్నప్పుడు ఓ ముసలామె భోజనం పెట్టి టీ ఇచ్చిందని అన్నారు. ఇక సినిమా ట్రైలర్ చూశా, మైండ్ బ్లోయింగ్ గా వుంది. ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తుందనే నమ్మకం ఉందన్నారు. ఇక గామి మార్చి 8న విడుదలవుతుంది, ఖచ్చితంగా అందరినీ సరికొత్తగా అలరిస్తుంది అని ఆయన అన్నారు

Exit mobile version