కోలీవుడ్ స్టార్ విష్ణు విశాల్ హీరోగా నటించిన “ఎఫ్ఐఆర్” చిత్రానికి తెలంగాణాలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఏకంగా సినిమాను డిమాండ్ చేయాలంటూ ఏఐఎంఐఎం డిమాండ్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. మను ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విష్ణు విశాల్, రెబా మోనికా జాన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మంజిమా మోహన్ ప్రధాన పాత్రలు పోషించారు.”ఎఫ్‌ఐఆర్” బ్యాన్ చేయాలంటూ తెలంగాణలోని ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) డిమాండ్ చేస్తోంది. AIMIM ఎమ్మెల్యేలు సయ్యద్ అహ్మద్ పాషా క్వాద్రీ, జాఫర్ హుస్సేన్ మెరాజ్, కౌసర్ మొహియుద్దీన్‌లు సినిమాటోగ్రఫీ మంత్రి టి శ్రీనివాస్ యాదవ్‌ని కలిసి ‘ఎఫ్‌ఐఆర్’ చిత్రానికి వ్యతిరేకంగా ఫిర్యాదు సమర్పించారు. ఈ సినిమా పోస్టర్‌లో బ్యాక్‌గ్రౌండ్‌లో ‘షహదా’ అనే పదం ఉండటం సినిమాపై వ్యతిరేకతకు కారణమని తెలుస్తోంది.
Read Also : Poojahegde : ముంబైకి మకాం మార్చడానికి రీజన్ ఇదేనట !
ఈ నెల 11న “ఎఫ్ఐఆర్” ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఎఫ్‌ఐఆర్‌ను మూడు దేశాల్లో విడుదల చేయకుండా నిషేధం విధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మలేషియా, కువైట్, ఖతార్‌లలో “ఎఫ్ఐఆర్”ను బ్యాన్ చేశారు. ఇదిలా ఉండగా ప్రేక్షకుల నుంచి సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. సోషల్ మీడియా వేదికగా సినిమాపై పలువురు ప్రశంసలు కురిపించారు.
