NTV Telugu Site icon

మోసగాళ్లు ట్రైలర్ రిలీజ్ ఫిక్స్

టాలెంటెడ్ హీరో మంచు విష్ణు తాజాగా చేస్తున్న చిత్రం మోసగాళ్లు. ప్రపంచంలోని అతిపెద్ద ఐటీ స్కాం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ చిత్రాన్ని జాఫ్రె చిన్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో మంచు విష్ణు సోదరి పాత్రలో స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు. అంతేకాకుండా బాలీవుడ్ సీనియర్ నటుడు సునీల్ శెట్టి పవర్ ఫుల్ పోలీస్ అధికారి పాత్రలో కనిపించనున్నారు. వీరితో పాట నవదీప్ కీలక పాత్రలో చేస్తున్నారు. ఈ సినిమాను యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ ట్రైలర్ ఈరోజు సాయంత్రం 4:05 గంటలకి విడుదల చేయనున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు విడుదలైన పోస్టర్‌లు, పాటలు అన్నీ కూడా సినిమాపై అంచనాలను అధికం చేశాయి. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.