Site icon NTV Telugu

Vishal 34: విశాల్ కోసం రంగంలోకి దిగిన ఇద్దరు స్టార్ డైరెక్టర్స్…

Vishal

Vishal

తెలుగులో ఓవర్ ది టాప్ మాస్ కమర్షియల్ సినిమా చెయ్యాలి అంటే అది బోయపాటి శ్రీనుకే సాధ్యం. ఊర మాస్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న బోయపాటి శ్రీను సినిమా వస్తుంది అంటే చాలు హీరో ఎవరు అనే విషయాన్ని పక్కన పెట్టి మరీ బీ, సీ సెంటర్ల ఆడియన్స్ థియేటర్స్ కి క్యు కడతారు. తెలుగులో బోయపాటి రేంజ్ కమర్షియల్ సినిమా చేసే దర్శకుడు మరొకరు లేరు కానీ తమిళ్ లో మాత్రం ఒకరు ఉన్నారు. మాస్ సినిమాలని రీడిఫైన్ చేసిన ఆ దర్శకుడి పేరు ‘హరి’. సూర్యతో ఆరు, సింగం, సింగం 2, దేవ సినిమాలు చేసిన హరికి కోలీవుడ్ లో కమర్షియల్ డైరెక్టర్ గా పేరుంది. మాస్ సినిమాలని మాత్రమే చేసే ఈ దర్శకుడు, తన నెక్స్ట్ సినిమాని సూర్యతో సింగం 3 తీస్తాడు అనుకుంటే అందరికీ షాక్ ఇస్తూ విశాల్ తో సినిమా అనౌన్స్ చేశాడు. విశాల్ తో ఇప్పటికే భరణి, పూజ సినిమాలు చేశాడు హరి. తెలుగులో కూడా రిలీజ్ అయిన ఈ రెండు సినిమాలు విశాల్ కి మంచి హిట్స్ గా నిలిచాయి.

శృతి హాసన్ నటించిన ‘పూజ’ సినిమా తెలుగులో సూపర్ హిట్ గా నిలిచింది. రెండు హిట్స్ కొట్టిన విశాల్-హరిలు ఇప్పుడు హ్యాట్రిక్ కొట్టడానికి రెడీ అయ్యారు. మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న కార్తిక్ సుబ్బరాజ్ ప్రొడక్షన్ హౌజ్ అయిన స్టోన్ బెంచర్స్ మరియు జీ స్టూడియోస్ సౌత్ కలిసి ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీ ‘విశాల్ 34’ అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్ళింది. ‘విశాల్ 34’ మెడికల్ మాఫియాకి చెందిన కథతో తెరక్కుతుందని కోలీవుడ్ వర్గాల సమాచారం. కొంతమంది మాత్రం యాక్షన్ లోకి దిగిన డాక్టర్ కథతో విశాల్ 34 రూపొందుతుందని అంటున్నారు. ఈ రెండింట్లో ఏది నిజం అనేది తెలియదు కానీ హరి-విశాల్-కార్తీక్ సుబ్బరాజ్ లు కలిసి సాలిడ్ మాస్ యాక్షన్ సినిమా చేస్తారు అని మాత్రం కాన్ఫిడెంట్ గా చెప్పొచ్చు. మరి విశాల్, హరి కలిసి మూడో సినిమాతో హ్యాట్రిక్ హిట్ అందుకుంటారో లేదో చూడాలి.

Exit mobile version