Site icon NTV Telugu

Virata Parvam: సరళ ఫ్యామిలీని కలిసి ఎమోషనల్ అయిన సాయి పల్లవి

Virata Parvam

Virata Parvam

రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం విరాట పర్వం. జూన్ 17 న ఈ సినిమా రిలీజ్ కానుండడంతో చిత్ర బృందం ప్రమోషన్ల వేగాన్ని వేగవంతం చేసింది. ఇక నిన్ననే వరంగల్ లో విరాటపర్వం ఆత్మీయ వేడుక ఘనంగా జరుపుకున్న విషయం విదితమే.. ఈ వేడుకలో ఈ సినిమాలోని వెన్నెల పాత్ర.. వరంగల్ లో నివసించే సరళ అనే యువతి జీవితం ఆధారంగా తెరక్కించారని చెప్పారు. దీంతో ఈరోజు విరాటపర్వం చిత్ర బృందం సరళ కుటుంబ సభ్యులను కలిశారు. ఇక ఈ చిత్ర బృందాన్ని సరళ కుటుంబ సభ్యులు సాదరంగా ఆహ్వానించారు.

సరళ తల్లి, సాయి పల్లవిని చూసి కంటనీరు పెట్టుకున్నారు. తన కూతురే ఇంటికి వచ్చినట్లు భావించి ఆమెకు చీర బహుమతిగా ఇచ్చారు. ఇక వారి ప్రేమను తట్టుకోలేని సాయి పల్లవి కూడా కంట నీరు పెట్టుకున్నారు. సరళ జీవితం గురించి ఆమె తల్లి కొద్దిసేపు చిత్ర బృందంతో మాట్లాడారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇకపోతే విరాటపర్వం చిత్రంలో సరళ పాత్రను వెన్నెల గా మార్చాడు దర్శకుడు. ప్రేమ గొప్పదా..? విప్లవం గొప్పదా..? అనే అంశాన్ని సున్నితంగా చూపించారు. ఇక సరళ పాత్రలో సాయి పల్లవి నటించింది అనడం కన్నా జీవించింది అని చెప్పాలి. మరి ఇన్ని అంచనాల మధ్య విడుదల అవుతున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Exit mobile version