కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ గుండెపోటు అంటూ ఉదయం నుంచి వార్తలు గుప్పుమంటున్న విషయం విదితమే.. ఆయనకు చేతిలో నొప్పి రావడంతో చెన్నైలోని కావేరి హాస్పిటల్ లో జాయిన్ చేశారని, ప్రస్తుతం విక్రమ్ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇక ఈ వార్తలతో విక్రమ్ అభిమానులు భయాందోళనలకు గురవుతున్నారు. విక్రమ్ కు ఎలా ఉంది..? అసలు ఎలా జరిగింది..? అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. దీంతో విక్రమ్ ఆరోగ్యంపై ఆయన మేనేజర్ సూర్యనారాయణన్ క్లారిటీ ఇచ్చారు.
విక్రమ్ కు గుండెపోటు అన్న వార్తలో నిజం లేదని, అదంతా ఫేక్ అని తేల్చి చెప్పారు. “విక్రమ్‌కి ఛాతీలో తేలికపాటి అసౌకర్యం కలిగింది, అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.. కొద్ది గంటల్లోనే ఆస్పత్రి నుంచి విక్రమ్ డిశార్జ్ అవుతారు.. పుకార్లు ఎవరూ నమ్మకండి.. ఈ పుకార్లు విని మేము ఎంతో బాధపడ్డాము. ఈ సమయంలో ఆయనకు, ఆ కుటుంబానికి ప్రైవసీ అవసరం.. దయచేసి ఇలాంటి అసత్యప్రచారాలను చేయడం ఆపండి” అంటూ ఒక పోస్ట్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో విక్రమ్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
