Vikram: వైవిధ్యంతోనే విక్రమ్ పయనం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vikram: మొదటి నుంచీ విక్రమ్ విలక్షణ నటనతోనే జనాన్ని అలరిస్తూ సాగుతున్నారు. ‘చియాన్’గా తమిళ జనం మదిలో నిలచిన విక్రమ్ ఇప్పటికీ వైవిధ్యానికే పెద్ద పీట వేస్తున్నారు. మణిరత్నం మేగ్నమ్ ఓపస్ ‘పొన్నియిన్ సెల్వన్’లో ఆదిత్య కరికాలన్ గా విక్రమ్ అభినయం ఆకట్టుకుంది. ఆ సినిమా సీక్వెల్ గా ‘పొన్నియిన్ సెల్వన్-2’ త్వరలోనే జనం ముందుకు రానుంది. ఈ సారి కూడా తనదైన నటనతో విక్రమ్ ఈ చిత్రంలో అలరిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు.
విక్రమ్ అసలు పేరు కెన్నడీ జాన్ విక్టర్. 1966 ఏప్రిల్ 17న జన్మించారు.ఆయన తండ్రి జాన్ విక్టర్ తరువాత వినోద్ రాజ్ పేరుతో తమిళ చిత్రాల్లో నటించారు. అయితే వినోద్ రాజ్ ఎన్ని చిత్రాలలో నటించినా, తాను కలలు కన్న స్టార్ డమ్ సొంతం చేసుకోలేక పోయారు. విక్రమ్ తల్లి రాజేశ్వరి సబ్ కలెక్టర్ గా పనిచేసేవారు. ఆమె తమ్ముడు ప్రముఖ నటుడు త్యాగరాజన్. తండ్రి, మేనమామ ఇద్దరి జీన్స్ కారణంగానేమో విక్రమ్ కు కూడా నటనపట్ల అమితాసక్తి కలిగింది. చదువుకొనే రోజుల నుంచీ విక్రమ్ నటుడు కావాలని తపించారు.
ఆరంభంలో విక్రమ్ “చిరునవ్వుల వరమిస్తావా, అక్కపెత్తనం -చెల్లెలి కాపురం, బంగారు కుటుంబం, ఆడాళ్ళా మజాకా, ఊహ, అక్కా బాగున్నావా?, మెరుపు, కుర్రాళ్ళ రాజ్యం, 9 నెలలు, యూత్” వంటి స్ట్రెయిట్ తెలుగు మూవీస్ లో నటించారు. ‘సేతు’ ఘనవిజయం సాధించిన తరువాత కూడా అంతకు ముందు అంగీకరించిన ‘యూత్’ చిత్రాన్ని పూర్తి చేశారు విక్రమ్. ఆ తరువాత నుంచీ విక్రమ్ తమిళనాట స్టార్ హీరో అయిపోయారు. వరుసగా వైవిధ్యమైన పాత్రల్లో తనదైన అభినయం ప్రదర్శిస్తూ సాగిపోయారు. విక్రమ్ హీరోగా తమిళనాట ఘనవిజయం సాధించిన అనేక చిత్రాలను తెలుగు స్టార్ హీరోస్ రీమేక్ చేయడం విశేషం. విక్రమ్ తో ‘సేతు’ తెరకెక్కించిన దర్శకుడు బాలా తరువాత అతనితో తీసిన ‘పితామగన్’ తెలుగులో ‘శివపుత్రుడు’గా అనువాదమైంది. ఈ సినిమాతోనే విక్రమ్ జాతీయ స్థాయిలో ఉత్తమ నటునిగా అవార్డు సంపాదించారు. ‘శివపుత్రుడు’ సినిమా తెలుగులోనూ విశేషాదరణ చూరగొంది. ఇక ‘జెంటిల్ మేన్’ శంకర్ దర్శకత్వంలో విక్రమ్
నటించిన ‘అన్నియన్’ తెలుగులో ‘అపరిచితుడు’గా అలరించింది. ఈ సినిమా విక్రమ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలచింది. ఆ తరువాత నుంచీ విక్రమ్ పలు వైవిధ్యమైన పాత్రలతో సాగుతూనే ఉన్నారు. కానీ,’అపరిచితుడు’ స్థాయి విజయం మాత్రం మళ్ళీ విక్రమ్ కు దక్కలేదనే చెప్పాలి.
Also Read
- Sudheer Joker: రాయల్ ఫ్యామిలీ దొంగ... ఆసక్తి రేపుతున్న ‘సుధీర్ జోకర్’ బ్యాంగర్!
- Purusha : భార్యల టార్చర్లు, మగాళ్ల కష్టాలు..క్షేమంగా వెళ్లి లాభంగా రండి వైబ్'లో ‘పురుష:’ ట్రైలర్!
- Peddi : భోపాల్'లో రెహమాన్ లైవ్ కాన్సెర్ట్.. ‘పెద్ది’ ఆడియో జాతర కోసం రూ. 150 కోట్ల భారీ సెటప్!
- Manchu Manoj : మైక్ వద్దు.. హెల్మెట్ పెట్టుకుని వెళ్లండి! మంచు ఫ్యామిలీ వివాదంపై మనోజ్ సెన్సేషనల్ కామెంట్స్
నటునిగానే కాకుండా, గాయకునిగానూ, డబ్బింగ్ ఆర్టిస్ట్ గానూ, టీవీ షోస్ తోనూ జనాన్ని ఆకట్టుకున్నారు విక్రమ్. తనలోని బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించుకోవాలని ఇప్పటికీ తపిస్తూనే ఉన్నారు విక్రమ్. ఏదో ఒకరోజు విక్రమ్ మళ్ళీ విజృంభిస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. ఫ్యాన్స్ అభిలాషను విక్రమ్ ఏ సినిమాతో నిజం చేస్తారో చూడాలి.
తాజావార్తలు
-
Team India Players: అఫ్గాన్ సిరీస్‌కు వన్డే, టెస్ట్ జట్ల ఎంపిక.. ఎవరెవరికి ఛాన్స్ ఇచ్చారంటే..
-
Putin: మరోసారి భారత్ టూర్‌కు పుతిన్.. ఎప్పుడంటే..!
-
Twisha Sharma Case: ట్విషా శర్మ భర్తపై లుక్ ఔట్ నోటీసులు
-
Manchu Manoj: రాజకీయాల్లోకి మంచు వారి కోడలు! స్పష్టం చేసిన హీరో మనోజ్….
-
PM Modi: ఐస్లాండ్ ప్రధాని క్రిస్ట్రాన్ మ్జోల్తో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ
ట్రెండింగ్
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్‌తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!