Site icon NTV Telugu

Vijay : భారీ ధర పలికిన విజయ్ జననాయగాన్ శాటిలైట్ రైట్స్

Vijay

Vijay

దళపతి విజయ్ త్వరలో పూర్తీ స్థాయి పోలిటికల్ ఎంట్రీ ఇవ్వ్వబోతున్నాడు. ఈ నేపధ్యంలో తన సినీ కెరీర్ లో చివరి సినిమా ‘జన నాయగన్‌’ల నటిస్తున్నాడు విజయ్. ఈ సినిమాకు H. వినోద్ దర్శకత్వం వహిస్తుస్తుండగా, బాలీవుడ్ భామ పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే మలయాళ నటి మమిత బైజు కీలక పాత్రలో కనిపిస్తోంది. అలాగే బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్ గా నటించబోతున్నాడు.

Also Read : Vaani Kapoor : వయ్యారాలు ఒలకబోస్తున్న వాణి కపూర్

కాగా ఈ సినిమా రైట్స్ కు భారీ పోటీ నెలకొంది. ఇప్పటికే జన నాయగన్‌ డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ భారీ ధరకు కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. అందిన సమాచారం ప్రకారం జన నాయగన్‌ డిజిటల్ రైట్స్ రూ. 121 కోట్లకు కొనుగోలు చేసినట్టు సమాచారం. అలాగే ఈ సినిమా ఆడియో రైట్స్ ను టీ సిరిస్ కొనుగోలు చేసింది. ఇక ఈ సినిమా శాటిలైట్ హక్కుల కోసం తీవ్ర పోటీ నెలకొంది. అయితే కోలీవుడ్ బడా నిర్మాణ సంస్థ సన్ పిచ్ర్స్ కు చెందిన సన్ నెట్ వర్క్ జన నాయగన్‌ శాటిలైట్ హక్కులను రూ. 55 కోట్లకు దక్కించుకుంది. విజయ్ చివరి సినిమా కావడంతో జన నాయగన్‌ రైట్స్ కోసం ఇంత డిమాండు ఏర్పడిందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. కోలీవుడ్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను KVN ప్రొడక్షన్స్ అత్యంత భారీ బడ్జెట్ పై నిర్మిస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.

Exit mobile version