NTV Telugu Site icon

Vimanam: ‘విమానం’ ట్రైలర్ లాంచ్ చేసిన మలయాళ బ్యూటీ…

Vimanam

Vimanam

బస్తీలో ఉండే తండ్రీ కొడుకులు.. పూట గ‌డిస్తే చాల‌నుకునే చాలీ చాల‌ని సంపాద‌న‌.. అలాంటి ఓ పేద కుటుంబంలోని ఉండే పిల్లాడుకి విమానం ఎక్కాల‌నే కోరిక పుడుతుంది. తండ్రి అవిటిత‌నంతో బాధ‌ప‌డుతున్న‌ప్ప‌టికీ కొడుకు కోరిక‌ను తీర్చాల‌నుకుని రాత్రి ప‌గ‌లు క‌ష్ట‌ప‌డుతుంటాడు. విమానం ఎక్కాల‌నుకునే కొడుకు కోరిక‌ను తీర్చటానికి ఏం చేయాలా? అని ఎప్పుడూ ఆలోచిస్తుంటాడు.

సుమ‌తీ అనే అమ్మాయిని ప్రేమించే కోటి.. లోక‌మంతా త‌న‌ను కామంతోనే చూస్తుంద‌ని భావించే ఆమెకు త‌నను మ‌న‌స్ఫూర్తిగా ప్రేమించే వాడున్నాడ‌ని తెలియ‌గానే ఆమె హృద‌యంలో నుంచి వచ్చే ఆవేద‌న‌.. ఇది రెండు హృద‌యాల మ‌ధ్య ఉండే ఎమోష‌న్‌..

హృద‌యాన్ని తాకే ఈ ఇలాంటి భావోద్వేగాల వ్య‌క్తుల ప్ర‌యాణాన్ని తెలియ‌జేసే చిత్ర‌మే ‘విమానం’ అని ఈ సినిమా ట్రైల‌ర్‌ను చూస్తుంటే స్ప‌ష్ట‌మ‌వుతుంది. శివ ప్రసాద్ యానాల దర్శకత్వంలో జీ స్టూడియోస్‌, కిర‌ణ్ కొర్ర‌పాటి (కిర‌ణ్ కొర్ర‌పాటి క్రియేటివ్ వ‌ర్క్స్‌) ‘విమానం’ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ట్రైల‌ర్‌ను హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ విడుద‌ల చేసింది. చిత్ర ద‌ర్శ‌కుడు శివ ప్ర‌సాద్ యానాల, నిర్మాతలు జీ స్టూడియోస్‌, కిర‌ణ్ కొర్ర‌పాటి మాట్లాడుతూ ట్రైలర్ లాంచ్ చేసిన అనుపమ పరమేశ్వరన్ కి ధన్యవాదాలు తెలిపారు.