Venu Swamy Crucial Comments on Tollywood Star Hero: ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి ఇటీవల మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చారు. దానికి కారణం ఆయన గతంలో ప్రభాస్ మీద చేసిన వ్యాఖ్యలే. గతంలో ప్రభాస్ గురించి మాట్లాడుతూ ప్రభాస్ కెరీర్ ముగిసింది, ఇక ఆయన ఏ సినిమా చేసిన ఫ్లాప్ అవుతుంది.. ఇక ఆయన రిటైర్మెంట్ తీసుకుని ఇంట్లో కూర్చుంటే బాగుంటుంది అంటూ మాట్లాడారు. ఇక ప్రభాస్ ఇటీవల సలార్ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకుని బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమార్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ పాన్ ఇండియా సినిమాకు మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది. అయితే మరి ప్రభాస్ కెరీర్ ముగిసిందని అన్నారు మరి సలార్ హిట్ అంటూ వేణు స్వామిపై ప్రభాస్ ఫ్యాన్స్ దాడికి దిగారు.
Salaar: సలార్ ఘనవిజయం.. “డార్లింగ్స్”కు ప్రభాస్ స్పెషల్ థ్యాంక్స్
అయితే దానిని వేణు స్వామి సమర్థించుకునే ప్రయత్నం చేశారు. ప్రభాస్ బహుబలి తర్వాత 4 సినిమాలు చేస్తే… 3 ఫ్లాప్ .. దీన్ని సక్సెస్ అంటారా అంటూ రివర్స్ మాట్లాడారు. ఇక ఇదిలా ఉంటే నూతన సంవత్సరం సందర్భంగా వేణు స్వామి ఈ ఏడాదిలో జరగబోయే విషయాలు చెప్పుకువచ్చారు. అందులో భాగంగానే సినిమా పరిశ్రమలో ఓ స్టార్ హీరో సినిమాలకు గుడ్ బై చెప్పనున్నట్లు వెల్లడించారు. వేణు స్వామి తాజాగా ఓ వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోలో మాట్లాడుతూ… ఒక ప్రముఖ హీరో.. టాలీవుడ్ కు సంబంధించిన స్టార్ హీరో.. రాబోయే కాలంలో చిత్ర పరిశ్రమ నుంచి నిష్క్రమించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఆరోగ్య పరమైన ఇబ్బందులతో సినిమాలు చేయను అనే రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉంది. అది ఈ సంవత్సరం కావచ్చు లేదా.. వచ్చే ఏడాది కావొచ్చు.. అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. అయితే ఆ హీరో ఎవరా అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. మీకు ఎవరనిపిస్తుందో కామెంట్ చేయండి.