Venu Swami Wife Veena Srivani Releases a Video Supporting his Husband: సమంత -నాగచైతన్య విడాకుల అంశానికి కొనసాగింపుగా నాగచైతన్య శోభిత జాతకం చెప్పానని చెబుతూ వేణు స్వామి ఒక వీడియో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యవహారం జరగకముందే వేణు స్వామి మీద తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ అనుబంధ సంస్థ తెలుగు ఫిలిం డిజిటల్ మీడియా అసోసియేషన్ తెలంగాణ ఉమెన్ కమిషన్ కి వేణు స్వామి మీద ఫిర్యాదు చేసింది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కూడా చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో వేణు స్వామి భార్య శ్రీవాణి ఒక వీడియో రిలీజ్ చేసింది. సో కాల్డ్ జర్నలిస్టులు సో కాల్డ్ జర్నలిస్టు సంఘాలు అంటూ మొదలుపెట్టిన ఆమె తాను కూడా ఒక మీడియా వ్యక్తిని అని చెబుతూ తన భర్తను కూడా సోకాల్డ్ జ్యోతిష్యుడు అంటూ పేర్కొంది.
Harish Shankar: స్మగ్లర్లు హీరోలన్న పవన్ కామెంట్స్ పై హరీష్ శంకర్ షాకింగ్ కామెంట్స్
అతను చెప్పిన అంశాల మీద గంటల తరబడి లైవ్ డిబేట్స్ నడిపిన మీరు ఇప్పుడు ఎందుకు అతని మీద ఫిర్యాదు చేశారు అని అర్థం వచ్చేలా ఒక వీడియో రిలీజ్ చేసింది. అతని గురించి చర్చలు జరిపే బదులు వేరే టాపిక్స్ మీద ఫోకస్ చేయొచ్చు కదా అని అంటూనే మీరేం జర్నలిస్టులు అసలు జర్నలిస్టులు అంటే మా టైంలో ఉండేవాళ్లు ఆ టైంలో జర్నలిజం విలువలు ఇలా ఉండేవి అంటూ తాను మీడియాలో పనిచేసిన రోజులను గుర్తు చేసుకుంది. నా భర్త జాతకాలు చెప్పాడే అనుకుందాం, అది ప్రజా సమస్యల కంటే పెద్ద విషయం కాదే అయినా దాన్ని మీరు ఎందుకు ఇంత సీన్ చేస్తున్నారని ఆమె ఎదురు ప్రశ్నిస్తోంది. ఒకపక్క మీడియా దిగజారి పోతుందని అంటూనే మరోపక్క తన భర్త మీద ఎందుకు కంప్లైంట్ ఇచ్చారంటూ ఆమె సీరియస్ అయింది. మరి ఇంకెందుకు ఆలస్యం ఆమె పోస్ట్ చేసిన వీడియో మీరు కూడా చూసేయండి.