Naga Chaitanya నెక్స్ట్ సినిమాపై వచ్చిన అప్డేట్ ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “థాంక్యూ” అనే చిత్రంలో నటిస్తున్నాడు చైతన్య. ఇప్పటికే షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఇక ఈ మధ్యే నాగ చైతన్య ఆ దర్శకుడితోనే “దూత” అనే వెబ్ సిరీస్ ను కూడా స్టార్ట్ చేశాడు. ఈ రెండు ప్రాజెక్టుల అనంతరం నాగ చైతన్య చేయనున్న సినిమా గురించి అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇటీవలి ఇంటర్వ్యూలో ‘మానాడు’తో బ్లాక్‌బస్టర్ హిట్ సాధించిన కోలీవుడ్ దర్శకుడు వెంకట్ ప్రభు తన నెక్స్ట్ మూవీ నాగ చైతన్యతో ఉంటుందని వెల్లడించారు. ఇది స్ట్రెయిట్ తెలుగు సినిమా కావడం విశేషం.
Read Also : RRR Mania : ఢిల్లీ ఏపీ భవన్ లో స్పెషల్ షోలు
90వ దశకం నేపథ్యంలో సాగే ద్విభాషా చిత్రంగా ఈ ప్రాజెక్ట్ రూపొందనుందని వెంకట్ ప్రభు తెలిపారు. ఇంకా అధికారికంగా ప్రకటించని ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా కనిపించనుందని సమాచారం. నాగ చైతన్య ప్రస్తుతం “థ్యాంక్యూ” షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు వెంకట్ ప్రభు తన కొత్త చిత్రం “మన్మధ లీలై” ప్రమోషన్‌లో బిజీగా ఉన్నారు. ఇందులో అశోక్ సెల్వన్, సంయుక్త హెడ్గే హీరోహీరోయిన్లుగా నటించారు.
