OG,శ్రీ సీతా రాముల కల్యాణం చూతము రారండి, అన్నయ్య, ప్రేమ కోసం, శివ రామరాజు లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో అలరించిన హీరో వెంకట్ సినిమాల్లోకి కమ్ బ్యాక్ ఇస్తున్నారు. విఆర్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో వెంకట్ హీరో రూపొందుతున్న మాస్ కమర్శియల్ ఎంటర్ టైనర్ ‘హరుడు’. రాజ్ తాళ్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి Dr దిక్కల లక్ష్మణ్ రావు, Dr ప్రవీణ్ రెడ్డి ఉన్నారు.. ఇప్పటికే విడుదలైన టీజర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మేకర్స్ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. సమ్మర్ స్పెషల్ గా మే 8న ఈ సినిమా వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది.
‘ఇది కంప్లీట్ మాస్ కమర్షియల్ ఎంటర్ టైనర్. ప్రేక్షకులు కొరుకునే అన్ని ఎలిమెంట్స్ ఇందులో వుంటాయి. ఇది అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించే కథ. వెంకట్ గారి ఇది మంచి కం బ్యాక్ మూవీ అవుతుంది’ అని చిత్ర నిర్మాతలు తెలియజేశారు. ఈ చిత్రంలో హెబ్బపటేల్ , సలోని , నాటషా ,అలీ,సుమన్,రవి వర్మ ,సుభశ్రీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ట్యాలెంటెడ్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. మని జీన్న సంగీతం అందిస్తుండగా ఆనంద్ డీవోపీగా పని చేస్తున్నారు. ఉప్పు మారుతీ ఎడిటర్.
