Operation Valentine Shoot Wrapped Up: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తెలుగు-హిందీ ద్విభాషా చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’ తో హిందీలో హీరోగా అరంగేట్రం చేస్తున్నారు. యదార్ధ సంఘటన స్ఫూర్తితో రూపొందుతున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్‌గా కనిపించనుండగా మనిషి చిల్లర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక తాజాగా ఈ సినిమా షూట్ పూర్తయింది. తాజాగా ఆపరేషన్ వాలెంటైన్ షూటింగ్ పూర్తి ” అని రాసి ఉన్న పోస్టర్ ని మేకర్స్ విడుదల చేసి ఈ విషయాన్ని అనౌన్స్ చేశారు. ఇక ఈ పోస్టర్ లో టీమ్ మొత్తం ఆనందంగా కనిపిస్తోండగా మానుషి చిల్లర్ ఈ సినిమాలో రాడార్ ఆఫీసర్ పాత్రలో నటిస్తోంది. దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాను హిందీ, తెలుగు భాషల్లో ఏకకాలంలో తెరకెక్కించారు. ఈ సినిమాలో కీలక పాత్రలో నటించిన నవదీప్ కూడా పోస్టర్ లో కనిపిస్తున్నారు.
Bhagavanth kesari: జై బాలయ్య అంటూ థియేటర్లో రచ్చ చేసిన మెగా డైరెక్టర్
ఇక ఈ ఆపరేషన్ వాలెంటైన్ డిసెంబర్ 8, 2023న తెలుగు, హిందీలో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అవుతుండగా భారతదేశం ఎన్నడూ చూడని అతిపెద్ద వైమానిక దాడుల్లో మన వైమానిక దళం హీరోలు, వారు ఎదుర్కొన్న సవాళ్లను చూపించే సినిమాగా చెబుతున్నారు. ఈ విజువల్ వండర్ ని భారీ కాన్వాస్‌పై రూపొందిస్తుండగా 2022లో విడుదలైన ‘మేజర్’ భారీ విజయం తర్వాత సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ మరో దేశభక్తి కథతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అనుభవజ్ఞుడైన యాడ్-ఫిల్మ్ మేకర్, సినిమాటోగ్రాఫర్ వీఎఫ్ఎక్స్ నిపుణుడు శక్తి ప్రతాప్ సింగ్ హుడా ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతుండగా శక్తి ప్రతాప్ సింగ్ హుడా, అమీర్ ఖాన్, సిద్ధార్థ్ రాజ్ కుమార్ రైటర్స్ ‘ఆపరేషన్ వాలెంటైన్’ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, రినైసన్స్ పిక్చర్స్ నుండి సందీప్ ముద్ద నిర్మించారు. ఇక ఈ సినిమాకి నందకుమార్ అబ్బినేని, గాడ్ బ్లెస్ ఎంటర్‌టైన్‌మెంట్ సహా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.